- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉగాది పంచాంగం : ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉన్నదంటే?
దిశ, ఫీచర్స్ : ఉగాది పండుగ వచ్చేస్తుంది. దీంతో చాలా మంది పంచాగం వింటారు. తమకు ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందని తెలుసుకుంటారు. కాగా, క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఏప్రిల్ 9 నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది.ఈ సంవత్సరంలో కుంభరాశి ఆదాయ వ్యయాలు చూస్తే..
ఆదాయం 14
వ్యయం 14
రాజ్యపూజ్యం 6
అవమానం 1
గత సంవత్సరం నుంచి కుంభ రాశి వారికి ఏలినాటి శని కొనసాగుతోంది. అయితే ఈ సంవత్సరంలో ఏలినాటి శని ఉన్నా.. ఈ రాశి వారికి ఆగస్టు వరకు అనుకున్న పనులన్నీ జరిగే అవకాశం ఉందంటున్నారు పండితులు. ఎందుకంటే? కుంభరాశి వారికి శుభాలనిచ్చే గురుడు అర్ధాష్టమంలో, రాహువు శుభ స్థానంలో ఉండగా, కేతువు మాత్రం అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశి వారికి సెప్టెంబర్ వరకు అన్ని విధాలా కలసివస్తుంది. ఇక సెప్టెంబర్ నుంచి చికాకులు, అనారోగ్య సమస్యలు, ఏం మాట్లాడినా వివాదాలు, పనులు వాయిదా పడటం, ఆర్థిక ఇబ్బందులు, కష్టానికి తగిన ఫలితం ఉండకపోవడం, ఇలా చాలా సమస్యలు ఎదుర్కొంటారు.
కానీ ఈ సంవత్సరంలో కుంభరాశి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ఏదైతే అనుకుంటారో, అది కచ్చితంగా నెరవేరుతుంది. వ్యాపారస్తులు సెప్టెంబర్ వరకు మంచి లాభాలను పొందుతారు. తర్వాత నష్టాలు చవి చూడక తప్పదు. ఇక ఉద్యోగులకు ఆగస్టులో ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. జాబ్ పోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక మిగిలిన అన్ని రంగాల వారికి ఆగస్టు వరకు అనుకూల ఉంటే, రాజకీయ నాయకులకు మాత్రం ఆగస్టు వరకు అన్నింటా వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఎన్నికలు ఈ లోగానే జరుగుతాయి కాబట్టి ఎన్నికల్లో గెపులు సాధ్యం అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఖర్చు బాగా చేస్తారు అయినా విజయం సాధించలేరు. రియలెస్టేట్ రంగంవారికి మాత్రమే ఈ సంవత్సరం బాగుంది. కళాకారులకు పర్వాలేదు.