Tirumala News: భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం

by Maddikunta Saikiran |
Tirumala News: భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో తిరుమలకు భక్తులు చాలా మంది క్యూ కట్టడంతో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం అంతకంతకు పెరుగుతూ వస్తోంది.గత జులై నెలలో శ్రీవారిని 22 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారని, ఒక్క జులై నెలలోనే శ్రీవారికి రూ.125 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా మొదటి ఆరు నెలలు 670 కోట్ల రూపాయిలు హుండీ ద్వారా ఆదాయం వచ్చిందని అధికారులు ఇదివరకే ప్రకటించారు.

ఈ సందర్బంగా టీటీడీ EO శ్యామలరావు డయల్ యువర్ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడూతూ... అన్నప్రసాదంలో భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని, అన్నప్రసాదంలో ఉన్న పాత యంత్రాల స్థానంలో కొత్తవాటిని తీసుకొస్తామని తెలిపారు. అలాగే తమిళనాడులో టీటీడీకి చెందిన భూముల అన్యాక్రాంతంపై చర్యలు తీసుకుంటామని, తిరుమలలో అత్యున్నత ప్రమాణాలతో కొత్త ల్యాబ్ ను ఏర్పాటు చేస్తామన్నారు. కాగా పదే పదే టిక్కెట్లు పొందుతున్న వారి ఐడిలను బ్లాక్ చేశామని, లడ్డూ తయారీకి నాణ్యమైన నెయ్యిని వాడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు టీటీడీ ఈవో శ్యామలరావు.

Next Story

Most Viewed