ఈ వారం ఆ రాశుల వారికి లైంగిక వాంఛలు పెరుగుతాయి.. !

by Sumithra |
ఈ వారం ఆ రాశుల వారికి లైంగిక వాంఛలు పెరుగుతాయి.. !
X

దిశ, ఫీచర్స్ : గ్రహాల కదలికలతో రాశుల్లో ఎన్నో మార్పులు వస్తుంటాయి. అలాగే జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజగ్రహం, శుక్ర గ్రహం కలిస్తే సంసార జీవితంలో కొన్ని మార్పులు వస్తాయని చెబుతున్నారు పండితులు. ఎందుకంటే శుక్రుడు స్త్రీ కాగా, కుజుడు పురుష సంబంధమైన గ్రహాలుగా జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అందుకే ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు దాంపత్య జీవితంలో, లైంగిక కార్యకలాపాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఏయే రాశుల వారికి ఈ వారంలో శృంగార కోరికలు, లైంగిక వాంఛలు అవధులు దాటే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశుల వారు ఫిబ్రవరి 15 వరకు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు.

వృషభం : ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. కుజుడితో కలిసి శుక్రుడు గుంభన స్థానంలో అంటే అష్టమ స్థానంలో సంచరిస్తుండడంతో రహస్య లైంగిక కార్యకలాపాలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రాశివారు సహజంగానే శృంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని, ఈ రెండు గ్రహాల కలయికతో ఆ కోరికలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

కర్కాటకం : ఈ రాశివారికి అధిపతి చంద్రుడు. శుక్ర, కుజుల ఆరవ స్థానంలో సంచరిస్తుండడంతో శృంగార కోరికలు పెరిగే అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాల కలయిక వలన ఈ రాశివారు శృంగార కోరికలు పెరగడం, చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కన్య : ఈ రాశికి అధిపతి బుధుడు. శుక్ర, కుజ గ్రహాలు ఈ రాశివారిలో సుఖ స్థానంలో అంటే చతుర్థ స్థానంలో కలవడం వలన శృంగాక కార్యకలాపాలు ఎక్కువగా చేసేఅవకాశం ఉంటుంది. ఈ రాశివారు దాంపత్య సుఖన్ని ఎక్కువగా పొందుతారు. విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తుల : ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశిలో కుజుడితో పాటు శుక్రుడు తృతీయ స్థానంలో సంచరిస్తుండడంతో శృంగార జీవితం కొత్తమలుపు తిరగనుంది. వీరిలో లైంగిక కోరికలు పెరగడం వలన అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంది. అలాగే వ్యసనాల పై మోజుకూడా పెరుగుతుంది. వీరికి కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వీరి దాంపత్య జీవితంలో అనుకూలత ఎక్కువగా పెరుగుతాయి.

మకరం : ఈ రాశికి అధిపతి శని. ఈ రాశివారిలో శుక్ర, కుజగ్రహం శయన స్థానంలో అంటే వ్యయ స్థానంలో సంచరించడం వలన శృంగార కోరికలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఈ పరిచయాలు అక్రమ సంబంధాలకు దారితీసే అవకాశం ఉంటుంది. విహార యాత్రలు, దూర ప్రయాణాలు చేస్తారు. దాంపత్య, శృంగార జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయి.

Advertisement

Next Story

Most Viewed