- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూజలో పట్టు వస్త్రాలు ధరించడం వెనకున్న అసలు రహస్యం ఇదే..!
దిశ,ఫీచర్స్: పెళ్లి మొదలుకుని.. ఎటువంటి పూజ చేసే వాళ్లు అయినా పట్టు వస్త్రాలను ధరిస్తారు. ఆడవారికి, పట్టు వస్త్రాలకు అభినవ భావ సంబంధం ఉంటుంది. రక రకాల రంగుల్లో ఎన్నో విధాల పట్టు వస్త్రాలు, చీరలు మనకెప్పుడూ అందుబాటులో ఉంటాయి. అయితే పట్టు వస్త్రాలను ధరించటానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి.ఆధునిక శాస్త్రం,ధర్మ శాస్త్రం ప్రకారం ప్రతి ప్రాణి చుట్టూ ఓరా అనబడే సప్త వర్ణ కాంతి పుంజం ఉంటుంది. అది మన శరీర మానసిక స్థితులను బట్టి మారుతూ ఉంటుంది.
పట్టు వస్త్రాలు ధరించినప్పుడు ఈ ఓరా ఎంతో శక్తి వంతంగా, కాంతివంతంగా మారి చుట్టూ ఉన్న అత్యున్నతమైన అనుకూల శక్తిని ఆకర్షించి మన శరీరంలో ప్రసరింపచేసేలా చేస్తుందట. అందుకే పవిత్ర కార్యచరణలోనూ పట్టు వస్త్రాలను ధరించమని.. ఇలా ఉండడం మన ధర్మం అని మన పెద్ద వాళ్లు చెబుతుంటారు. పట్టు పురుగులను వేడి నీళ్లలో వేసి, వాటి పోగులను దారాలుగా పట్టు వస్త్రాలను నేస్తారు. మనసుకున్న ప్రతి ఒక్కరికి ఇది అత్యంత బాధనే కలిగిస్తాయి. ప్రతి జీవికి ఒక పరమార్ధం ఉంటుంది. పట్టు పురుగుల పరమార్ధం ఇదేనేమో.