అంబరాన్నంటిన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సప్తరాత్రోత్సవాలు

by Bhoopathi Nagaiah |
అంబరాన్నంటిన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సప్తరాత్రోత్సవాలు
X

దిశ, మంత్రాలయం: శ్రీ మఠంలో రాఘవేంద్ర స్వామి 353వ సప్తరాత్రోత్సవాల సంబరాలు అంబరాన్ని అంటాయి. 18వ తేదీ ఆదివారం నుంచి స్వామివారి ఆరాధన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఆరాధన ఉత్సవాల్లో భాగంగా ఉదయాన్నే స్వామి వారి మూల బృందావనం నిర్మాల్య విసర్జన, ఉత్సవ రాయరా పాదపూజ, పంచామృత అభిషేకం, సంస్థాన పూజ అలంకార సంతర్పణ, అష్టోదక పూజ, మహా మంగళహారతి నిర్వహిస్తారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రాకార ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.


అదేవిధంగా శ్రీ మఠంలో నూతనంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభ పూజలు శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామీజీ చేతుల మీదగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన ముంజల మండపం, మధ్య మార్గ కారిడార్, రాఘవేంద్ర సర్కిల్ మొదలగు వాటిని స్వామీజీ ప్రారంభించారు. కనక, రజత, రాగి, కంచు, చెక్క రథాల ఊరేగింపు ఆలయ ఆవరణంలో ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ప్రాకారంలో పండితుల ద్వారా ప్రవచనాలు, స్వామివారి పల్లకి సేవలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఆరాధన మహోత్సవాలకు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.


ముఖ్యంగా కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. శ్రీ మఠం చేరుకున్న భక్తులకు మఠం అధికారులు తగిన సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు ముందుగా తుంగభద్రా నదిలో స్నానం ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మని దర్శించుకుని అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనం దర్శించుకుంటారు. అదేవిధంగా భక్తులు శ్రీ మఠం సేవ నిమిత్తం అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ వారం రోజుల ఉత్సవాలలో మంగళచ బుధ, గురువారాల్లో పూర్వారాధన, మధ్య ఆరాధన, ఉత్తరారాధన జరపనున్నారు.ఉత్తరారాధన రోజు శ్రీ మఠం పురవీధుల వెంబడి భారీ రథోత్సవం లాగనున్నారు. ఆ సమయంలో హెలికాప్టర్ నుంచి పూల వర్షంతో శ్రీ మఠం పీఠాధిపతి భక్తులను ఆశీర్వదిస్తారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు లక్షల్లో పాల్గొంటారు.

Advertisement

Next Story

Most Viewed