Parvati Devi: పార్వతి దేవి తొమ్మిది రూపాల గురించి తెలుసా?

by Prasanna |   ( Updated:2023-03-12 04:23:53.0  )
Parvati Devi: పార్వతి దేవి తొమ్మిది రూపాల గురించి తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: దేవి నవరాత్రుల రోజుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలతో అలకంరించి అర్చిస్తారు. అప్పుడు ఒక్కో రోజు ఒక్కో పేరు చెప్పున దేవికి తొమ్మిది పేర్లు ఉంటాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం

1. శైలపుత్రీ

ఈమె వృషభ వాహనం మీద ఉంటుంది. ఈమెకు రెండు చేతులు ఉంటాయి. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ధరించి ఉంటుంది.

2. బ్రహ్మచారిణీ

ఈమె జ్యోతి స్వరూపిణి. కుడి చేతిలో జప మాల. ఎడమ చేతిలో కమండలం ధరించి ఉంటుంది.

3. చంద్రఘంటా

ఈమెకు పది చేతులు. పలు వస్త్రాలను ధరించి , స్వర్ణ కాంతితో భాసిస్తూంటుంది.

4. కూష్మాండా

ఈమె అష్ట భుజాలలో కమండలం, ధనస్సు, బాణం , కమలం , అమృత కలశం , చక్రం, గద , జప మాల వీటిని పట్టుకొని ఉంటుంది.

5. కండ మాత

ఈమె రెండు చేతుల్లో కమలాలు పట్టుకొని ఉంటుంది. ఈమె వాహనం సింహం.

6. కాత్యాయని

ఈమెకు నాలుగు భుజాలు, అభయ ముద్ర, వర ముద్ర, ఖడ్గం, పద్మం ధరించి ఉంటుంది.

7. కాళరాత్రీ

ఈమె శరీరపు కాంతి నలుపు . నేత్రాలు బీకరంగా ఉంటాయి. నాలుగు భుజాలతో అభయ వర ముద్రతో ఖడ్గం ధరించి గాడిద వాహనం మీద ఉంటుంది.

8. మహా గౌరీ

నాలుగు భాజాలు కలిగి అభయ, త్రిశూలం పట్టుకొని ఉంటుంది. వాహనం వృషభం.

9. సిద్ధిధాత్రీ

నాలుగు చేతులలో శంఖం, గద , కమలాలు పట్టుకొని ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed