Vaishakha Amavasya: మే 7 న వైశాఖ అమావాస్య.. ఆ రోజున ఇలా చేస్తే నర దిష్టి, నర ఘోష పూర్తిగా తొలగిపోతుంది

by Disha Web Desk 10 |
Vaishakha Amavasya: మే 7 న వైశాఖ అమావాస్య.. ఆ రోజున ఇలా చేస్తే  నర దిష్టి, నర ఘోష పూర్తిగా తొలగిపోతుంది
X

దిశ, ఫీచర్స్: హిందువులు సాధారణంగా అమావాస్యను అశుభకరమైన సంఘటనగా భావిస్తారు. ఈ రోజున ఏ పనులు తలపెట్టినా ఆ పనులు పూర్తి కావని అంటారు. కానీ, జ్యోతిష్యం ప్రకారం ఈ రోజు కొన్ని పనులకు అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. పూర్వీకుల ఆత్మ శాంతి కోసం అమావాస్య రోజున తర్పణం, పిండాన, శ్రాద్ధం చేస్తారు. .అంతేకాకుండా ఈ రోజున చాలామందికి దానాలు కూడా చేస్తారు. ఈ పవిత్ర కర్మలను ఆచరించడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది.

వైశాఖ అమావాస్య తేదీ, శుభ సమయం

హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ మాసం ప్రారంభమైంది. ఈ మాస అమావాస్యను వైశాఖ అమావాస్య అంటారు. ఇది మే 7వ తేదీ ఉదయం 11:41 గంటలకు ప్రారంభమయ్యి మరుసటి రోజు మే 8 వ తేదీ ఉదయం 8:51 గంటలకు ముగుస్తుంది.

అమావాస్య రోజు ఇలా చేస్తే మంచిది..

పురాణాల ప్రకారం, వైశాఖ అమావాస్య రోజున విష్ణువును పూజించే సంప్రదాయం కూడా ఉంది. ఈరోజు శ్రీ హరి ఆరాధన వలన మోక్షం కలిగి నర దిష్టి, నర ఘోష పూర్తిగా తొలగిపోతుంది. విష్ణువు, పితృదేవతలు చెట్టుపై నివసిస్తారని చెబుతుంటారు కాబట్టి అదే రోజు రావి చెట్టుకు నీరు పోయడం వలన మంచి ఫలితాలను ఇస్తుంది. మీ జాతకంలో పితృ దోషాన్ని తొలగించడానికి ఈ రోజున పిత్రా చాలీసాను పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story

Most Viewed