ప్రాణం ఉన్న శివలింగం.. ఈ ఆలయం గురించి తెలిస్తే షాక్ అవుతారు

by Jakkula Samataha |
ప్రాణం ఉన్న శివలింగం.. ఈ ఆలయం గురించి తెలిస్తే షాక్ అవుతారు
X

దిశ, ఫీచర్స్ : నేడు మహా శివరాత్రి. ఈ రోజు శివ భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్టగా ఆ పరమేశ్వరుడిని కొలుచుకుంటారు. అంతే కాకుండా ఉపవాసం ఉంటూ, జాగరణ చేస్తారు. ముఖ్యంగా ఈ రోజు ప్రతి పల్లె, పట్టణంలో ఆలయాలన్నీ శివనామస్మరణతో, భక్తులతో కిట కిటలాడుతుంటాయి. ఇక ఈ పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పుణ్య‌క్షేత్రంలో ప్రాణం ఉన్న ఏకైక లింగంగా వాయు లింగేశ్వరుడు కొలువైయ్యాడు. శ్రీ కాళహస్తీశ్వరుడు స్వయంభూగా వెలిశారని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి.ఇక్కడ భక్తితో కొలిచే భక్తుడికే తొలి ప్రాధాన్యత అనడటానికి నిదర్శనం భక్త కన్నప్ప.

భక్తకన్నప్ప వాయు లింగేశ్వరుడిని ఎంతో భక్తితో కొలిచేవాడు. ఆయన భక్తికి ముగ్ధుడైన ఆ పరమ శివుడు ఏకంగా కన్నప్ప మాంసాన్ని పెట్టినా, అదే మహా ప్రసాదంగా స్వీకరిచాడంటే, ఆయన భక్తి ఎంత గొప్పదో అర్థం చేసుకొవచ్చు. ఇక శివయ్య కంట్లో కన్నీరు చూడలేక తన కళ్ళను దానం చేసి, చివరకు స్వామి వారిలోనే ఐక్యం అయిన పరమ భక్తుడు భక్త కన్నప్ప. అందువలన అక్కడి వాయు లింగేశ్వరుడిని ప్రాణం ఉన్న దేవుడిగా భక్తులు భావిస్తారు. అంతే కాకుండా ఈ క్షేత్రంలో సాలెపురుగు పాము ఏనుగు ఈ మూడు మూగజీవాలు తమ భక్తితో పరమేశ్వరుని అర్చించి పూజలు చేస్తూ వచ్చాయి. భక్తి పారవశ్యంలో తమలో తామే కలయించుకొని ముక్తి పొందాయి. ఈ మూడు మూగజీవాల పేర్లతోనే శ్రీకాళహస్తిగా ఈ క్షేత్రం స్థిరపడింది.

Advertisement

Next Story

Most Viewed