ఆమె రొమ్ము తెగిపడిన ప్రాంతామే ఈ పుణ్య క్షేత్రం.. అక్కడి కన్నీళ్ల రహస్యం ఇదే..!

by Sumithra |
ఆమె రొమ్ము తెగిపడిన ప్రాంతామే ఈ పుణ్య క్షేత్రం.. అక్కడి కన్నీళ్ల రహస్యం ఇదే..!
X

దిశ, ఫీచర్స్ : మన భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒక ఆలయమే శ్రీ బజ్రేశ్వరి దేవి ఆలయం. హిమాచల్‌లోని ప్రసిద్ధ శ్రీ బజ్రేశ్వరి దేవి ఆలయాన్ని నాగర్ కోట్ దేవి, కాంగ్రా దేవి అని కూడా పిలుస్తారు. ఇది వజ్రేశ్వరి దేవతకు అంకితం చేయబడిన 51 శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి. ఇది ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా పట్టణంలో ఉన్న దుర్గా దేవి రూపం.

మాతా సతీదేవి ఎడమ రొమ్ము పడిన స్థలం..

పూర్వం దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు. కానీ కూతురిని, అల్లుడిని పిలవలేదు. ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి ? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది. కాని అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె ఆత్మార్పణ చేసుకుంది. దీంతో ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.

సతీ వియోగం దుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్ష నా కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించిన విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధన స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని తోడుగా దర్శనమిస్తుంది. సతీదేవి ఎడమ రొమ్ము పడిప ప్రదేశంలో అమ్మవారిని మా బ్రజేశ్వరి లేదా కాంగ్రా మాయి పేరుతో పూజిస్తారు.

ఆలయ చరిత్ర..

ఈ ఆలయ ప్రధాన ద్వారం ప్రవేశ ద్వారం నాగర్‌ఖానా లేదా డ్రమ్ హౌస్ రూపంలో బస్సేన్ కోట ప్రవేశ ద్వారంలాగా నిర్మించారు. ఈ దేవాలయం చుట్టూ కోట వంటి రాతి గోడ కూడా ఉంది. ప్రధాన ఆలయంలో వజ్రేశ్వరి దేవి దర్శనం ఇస్తుంది. ఈ ఆలయంలో భైరవుని చిన్న ఆలయం కూడా ఉంది. ప్రధాన ఆలయం ముందు ధయాను భగత్ విగ్రహం కూడా ఉంది. అక్బర్ సమయంలో అతను తన తలను దేవికి సమర్పించాడు. ప్రస్తుత నిర్మాణంలో మూడు సమాధులు ఉన్నాయి.

విగ్రహం నుంచి కన్నీరు కారుతుంది..

కాంగ్రాలోని వజ్రేశ్వరి దేవి ఆలయంలో భైరవుని విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. పురాణాల ప్రకారం, చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైనా సంక్షోభం సంభవించినప్పుడు, భైరవుని విగ్రహం కళ్ల నుంచి కన్నీరు కారడం ప్రారంభమవుతుందని పండితులు చెబుతున్నారు. విగ్రహం నుండి కన్నీళ్లు రావడం చూసి, అక్కడున్న పండితులు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక పూజలు చేస్తారట. ఈ భైరవ విగ్రహం సుమారు ఐదు వేల సంవత్సరాల నాటిదని చెబుతారు. భైరవుని కన్నీళ్ల వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారట.

Advertisement

Next Story