హనుమాన్ జయంతి రోజు నుంచి ఈ రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు.. మీ రాశి ఉందా?

by Disha Web Desk 10 |
హనుమాన్ జయంతి రోజు నుంచి ఈ రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు.. మీ రాశి ఉందా?
X

దిశ, ఫీచర్స్: హిందువులు జరుపుకునే పండుగలలో హనుమాన్ జయంతి కూడా ఒకటి. ఈ పండుగను ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌లో జరుపుకుంటారు. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ 23న వచ్చింది.ఈ రోజున ఆంజనేయుడిని పూజించి ఉపవాసం ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం హనుమాన్ జయంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఆ రోజు చాలా శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. దీంతో మరింత ప్రాధాన్యత పెరిగిందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. హనుమాన్ జయంతి రోజున ప్రత్యేక యోగాల కారణంగా, ఈ రాశుల వారికి శుభంగా ఉండనుంది. అలాగే శనిదేవుని ప్రభావం నుంచి విముక్తి పొందుతారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

కర్కాటక రాశి

హనుమాన్ జయంతి కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడం వలన మీరు ఊహించని ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు మంచి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. అంతే కాకుండా, మీరు రకాల పెండింగ్ పనులన్ని సులభంగా పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి

హనుమాన్ జయంతి రోజున వృశ్చిక రాశి వారికి కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో కారు, కొత్త ఇల్లు కూడా కొనుగోలు చేయవచ్చు. మీ కుటుంబంతో కలిసి మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది.

Next Story

Most Viewed