క్రిశాంక్ అరెస్ట్‌.. ఆ రెండు పార్టీలకు హరీష్ రావు సీరియస్ వార్నింగ్

by Sathputhe Rajesh |   ( Updated:2024-05-02 05:42:24.0  )
క్రిశాంక్ అరెస్ట్‌.. ఆ రెండు పార్టీలకు హరీష్ రావు సీరియస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ అరెస్ట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు (Thanneeru Harish Rao) ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఇక, ఓయూ పేరిట ఫేక్ సర్క్యూలర్‌ను సోషల్ మీడియాలో సర్యూలేట్ చేసిన కేసులో మన్నె క్రిశాంక్‌పై పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనను నిన్న పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరు పరిచారు. జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా.. పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.

Advertisement

Next Story