చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని కన్నుమూత

by Jakkula Samataha |
చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని కన్నుమూత
X

దిశ, సినిమా : తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయని ఉమా రామనన్(72) అనారోగ్య సమస్యలతో బుధవారం కన్నుమూశారు. ఇక ఈమె 35 ఏళ్లలో ఆరు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఇళయరాజ, మణిశర్మ, దేవా, విద్యాసాగార్ ఇలా ఎంతో మంది గాయకులతో ఉమా రామనన్ కలిసి పనిచేశారు. తమిళ సంగీతానికి ఈమె చేసిన కృషి ఎంతో ఉన్నతమైనది. తన గానంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. అలాంటి గొప్ప గాయని అకస్మాత్తుగా కన్నుమూయడంతో.. అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఉమా రామనన్ తెలుగులో చివరగా ఓ చిన్నదాన అనే సినిమాలో ఓ పాటను ఆలపించారు. కాగా, కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈమె, ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో నిన్న మరణించినట్లు తెలుస్తోంది. ఈమె మరణం పట్ల పలువురు గాయని, గాయకులు, నటీనటులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఉమా మరణంతో ఒక్కసారిగా తమిళ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇక ఈ మధ్యకాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది మరణిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇండస్ట్రీకి తీరని లోటు అనే చెప్పాలి.

Advertisement

Next Story