వెడ్డింగ్ కార్డులో మోడీ పేరు.. చిక్కుల్లో పడ్డ పెళ్లి కొడుకు.. అసలు ఏం జరిగిందంటే..

by Sujitha Rachapalli |   ( Updated:2024-05-02 05:43:03.0  )
వెడ్డింగ్ కార్డులో మోడీ పేరు..  చిక్కుల్లో పడ్డ పెళ్లి కొడుకు.. అసలు ఏం జరిగిందంటే..
X

దిశ, ఫీచర్స్: అభిమానానికి కూడా హద్దులు ఉండాలని పెద్దలు హెచ్చరిస్తారు. లేదంటే కష్టాల్లో పడిపోగలరని సూచిస్తారు. ఇక్కడ ఇదే జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అభిమానం ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా చేసింది. శుభమా అని పెళ్లి జరుగుతుంటే వరుడు లేనిపోని ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. మరి ఇంతకు వివాహం జరిగిందా లేదా? అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

దక్షిణ కన్నడ పుత్తూరు తాలూకాలోని ఉప్పినంగడికి చెందిన వరుడు తన పెళ్లి పత్రికలో మోడీ పేరును చేర్చాడు. ఆయనను మళ్లీ ప్రధాన మంత్రిని చేయడమే వధూవరులకు మీరు ఇచ్చే బహుమతి అని కార్డులో రాయించాడు. అయితే ఇది చూసిన ఓ బంధువు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వరుడి ఇంటికి చేరుకుని విచారించగా.. ఎన్నికల కోడ్ రాకముందే మార్చి 1న కార్డులు ప్రింట్ అయినట్లు తెలిపాడు. ఏప్రిల్ 18న వివాహం జరిగినట్లు వివరించాడు. కానీ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఈసీ ఆయనతోపాటు కార్డులను ముద్రించిన ప్రెస్ యజమానిపై కూడా FIR ఫైల్ చేసింది. ఇలాంటి చర్యలు ఉల్లంఘన కిందకే వస్తాయని తెలిపింది.

Advertisement

Next Story