- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BRS ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు హై కోర్టు నోటీసులు

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. వారి ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లలో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తప్పుడు వివరాలతో మల్లారెడ్డి అఫిడవిట్ సమర్పించారని కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ పిటిషన్ వేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మల్లారెడ్డి ఎన్నికల సమయంలో తన అఫిడవిట్‌లో సూరారం గ్రామంలో కొంత భూమి ఉందని పేర్కొనగా.. రికార్డుల ప్రకారం అది గవర్నమెంట్ ల్యాండ్ అని పిటిషనర్ పేర్కొన్నారు. మల్లారెడ్డి తన అఫిడవిట్ లో బ్యాంకు ఖాతాలు లేవని తెలిపారని.. బ్యాంకు ఖాతాలు లేకుండా ఐటీ ఎలా దాఖలు చేస్తున్నారో వివరాలు వెల్లడించలేదని తెలిపారు.
Next Story