కోలీవుడ్ కి ఫస్ట్ 100 కోట్ల మూవీ ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?..ఆమె ఎవరంటే?

by Kavitha |   ( Updated:2024-05-02 08:58:55.0  )
కోలీవుడ్ కి ఫస్ట్ 100 కోట్ల మూవీ ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?..ఆమె ఎవరంటే?
X

దిశ,సినిమా: 2001లో ‘ఇష్టం’ మూవీ తో మొదలు అయి తెలుగు పరిశ్రమలో ఒకప్పుడు శ్రియ శరన్ ఒక వెలుగు వెలిగింది. తర్వాత పెళ్లి జరిగి ఓ బిడ్డకు తల్లిగా అయినటువంటి ఈమె పెద్ద ఎత్తున అందాలను ఆరబోస్తూ సందడి చేస్తున్నారు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి శ్రియ కేవలం సౌత్ సినిమాల్లో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

అయితే ఈమెకి సంబంధించిన వార్త బాగా చక్కర్లు కొడుతుంది. ఒకప్పుడు సౌత్ ఇండియాను డామినేట్ చేసిన కోలీవుడ్ కి కూడా 100 కోట్ల చిత్రం ఇవ్వడానికి దశాబ్దాలు పట్టింది. 2007లో అది శ్రియా శరన్ వలన సాకారం అయింది. కోలీవుడ్‌లో ఫస్ట్ రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టిన మొదటి సినిమా శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘శివాజీ’ .ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ. 125 నుండి 160 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలో విలన్ గా నటుడు సుమన్-రజినీకాంత్ కాంబినేషన్ సీన్స్ సినిమాకు హైలెట్.

Read More..

ఫిలిం ఛాంబర్ ముందు నగ్నంగా శ్రీరెడ్డి ధర్నా.. నెట్టింట దుమారం రేపిన ఫొటోలు, వీడియోలు!!

ఇక ఈ సినిమా విషయానికి వస్తే మార్క్ సోషల్ సబ్జెక్టు తో కూడిన కమర్షియల్ మూవీగా అలాగే వ్యవస్థల్లో ఉన్న అవినీతి మీద ఓ ఎన్నారై చేసిన పోరాటాన్ని శివాజీగా దర్శకుడు శంకర్ తెరకెక్కించారు. దానితో పాటు శ్రియా మనసు గెలుచుకునేందుకు రజినీకాంత్ పడే పాట్లు నవ్వులు పూయిస్తాయి. ఇక ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అద్భుతం అని చెప్పాలి.

Advertisement

Next Story