- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాల రాముడు తన బాల్యంలో చేసిన చిలిపి పనులేంటో తెలుసా..?
దిశ, ఫీచర్స్: ముద్దులొలికే బాల రాముడిని చూసిన రాజ్య ప్రజలు సంతోషంతో చిందులు వేశారు. చిన్ని రాముడు అందరి కన్నా ముందు కేరింతలు కొడుతూ.. బోర్లా పడటం.. మెల్లిగా పట్టుకుని నిలుచోవడం.. బుజ్జి బుజ్జి అడుగులు వేయడం.. మెల్లిగా నడవడం.. మొదలు పెట్టాడు.
ఒక రోజు బుల్లి రాముడు రాజ భవనంలో ఆడుకుంటూ ఉండగా.. చీకటి పడి ఆకాశంలో చంద్రబింబం పైకి వచ్చింది..అది పౌర్ణమి రోజు కావడంతో చంద్రుడు నిండుగా ఆకాశంలో మెరుస్తూ ఉన్నాడు.. అదే కాకుండా నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఆ వస్తువులతో ఆడుకుంటున్న ఈ బాల రాముడు అన్నీ విడిచి పెట్టి.. నాకు ఆ చందమామ కావాలని మారం చేయడం మొదలు పెట్టాడు... చాలామంది నచ్చజెప్పాలని ప్రయత్నించారు.. కానీ మొండి పట్టిన రాముడు ఎవరి మాటలు వినలేదు.. ఆకాశంలో ఉన్న చందమామని నేల మీదకు తీసుకురావడం అసాధ్యం అని చెప్పడంతో .. బాల రాముడికి నచ్చలేదు.. నాకు ఆ చందమామే కావాలంటూ గట్టి గట్టిగా ఏడ్చాడు. అతన్ని ఆపడం ఎవరి వల్లా కాలేదు.. ఇంతలో ఒకరు ఒక బంగారు పళ్ళెంలో నీళ్ళు పోసి అతని ముందు పెట్టారు.. ఆ నీటిలో చంద్రుడు ప్రతిబింబం కనిపించడంతో.. అది చూసిన బాల రాముడు సంతోషంతో.. ఆ చందమామతో ఆటలు ఆడాడు.. కాలం గడిచే కొద్దీ రాముడు, లక్ష్మణ భరత శతృజ్నులు విద్యతో పాటు.. యుద్ధ విద్యలు కూడా చిన్నతనంలోనే నేర్చుకున్నారు.