- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భద్రాద్రి రామాలయం ముస్తాబు.. నేడు గోదావరిలో తెప్పోత్సవం
ముక్కోటికి భద్రాద్రి ముస్తాబు అయ్యింది. రామాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని నేడు గోదావరిలో స్వామివారి తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం తెల్లవారుజామున గరుడవాహనంపై రామచంద్రమూర్తి ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈసారి వేడుకలు తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో కలెక్టర్ ప్రియాంక అలా దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ దీపాలంకరణ మధ్య భద్రాద్రి రామాలయం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. గోదావరి తీరంలో హంసాలంకృత లాంచీకి, ఉత్తరద్వారానికి సైతం దీపాలంకరణ చేయడంతో సరికొత్త శోభతో భక్తులకు దర్శనమిస్తున్నాయి.
దిశ, భద్రాచలం: ముక్కోటికి భద్రాద్రి ముస్తాబు అయ్యింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, ఈసారి వేడుకలు తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో కలెక్టర్ ప్రియాంక ఆలా దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. రామాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం
గోదావరిలో స్వామి వారి తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం తెల్లవారుజామున గరుడ వాహనంపై రామచంద్రమూర్తి ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రెండు ఉత్సవాల కోసం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ దీపాలంకరణ మధ్య భద్రాద్రి రామాలయం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. గోదావరి తీరంలో హంసాలంకృత లాంచీకి, ఉత్తర ద్వారానికి సైతం దీపాలంకరణ చేయడంతో సరికొత్త అందంతో భక్తులకు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక అల, ఎస్పీ వినీత్, ఏఎస్పీ పరితోష్ పంకజ్, భద్రాద్రి దేవస్థానం ఈవో రమాదేవి, ఆర్డీఓ మంగీలాల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఇటీవల కొలువుదీరడం తో భారీగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, న్యాయ విభాగం, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల13న శ్రీ వైకుంఠ ఏకాదశీ అధ్యయనోత్సవాలు ప్రారంభం కాగా శుక్రవారం ఉదయం తిరుమంగై ఆళ్వార్ పరమపదోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం స్వామివారికి గోదావరిలో తెప్పోత్సవం నిర్వహించనుండటంతో పగల్పత్తు ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం తెల్లవారుజామున స్వామివారు ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శీఘ్రదర్శనం, అదనపు ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేశారు. వసతి, తాగునీటి పై ప్రత్యేక దృష్టి సారించారు.