మస్తు డిమాండ్... మురుండా లడ్డు

by Kalyani |
మస్తు డిమాండ్... మురుండా లడ్డు
X

దిశ, కంగ్టి : కంగ్టి, నారాయణఖేడ్, పిట్లం ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన స్వీట్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీని పేరు 'మురుండా లడ్డు' ఈ స్వీట్ సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అది కూడా నవంబర్ , డిసెంబర్ సమయంలో అందుబాటులో ఉంటుంది. ఈ స్వీట్ కోసం ప్రజలు కొన్ని నెలలకు ముందు నుంచే కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. ఈ లడ్డు ఎందుకు అంత ప్రసిద్ధి. ఈ లడ్డు ఎందుకు ఈ సమయంలోనే లభిస్తుంది వంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లడ్డును అందరూ తయారు చేయలేరు. తరతరాలుగా ఇందులో ప్రావీణ్యం సంపాదించిన కర్ణాటక బీదర్ ప్రాంతంలో ప్రత్యేక వంట వారితో దీనిని తయారు చేయిస్తారు. ఈ లడ్డుని సంప్రదాయ పద్ధతుల్లో తయారుచేస్తారు. ఇది చాలా సమయం, కృషిని తీసుకుంటుంది.

దీన్ని తయారు చేయడానికి ప్రధానంగా చెరుకు రసం , కొబ్బరి పొడి , కాజూ , కిస్మిస్ , బాదం , నువ్వులు, నెయ్యి, వివిధ పప్పు దినుసులు, మక్కా పిండి ఉపయోగిస్తారు. దీని కారణంగా దాని పొరలు చాలా స్ఫుటంగా, రుచిగా ఉంటాయి. మురుండా లడ్డు లో పోషకాలు (కాల్షియం , విటమిన్స్) సమృద్ధిగా ఉంటాయి. దీన్ని సిద్ధం చేయడానికి గంటల కొద్దీ కష్టపడాల్సి వస్తుందని తయారీదారులు "దిశ" కి తెలిపారు. అన్ని రకాల పదార్థాలతో తయారు చేయడం ద్వారా ప్రతి పొర, రుచిని వివరంగా అనుభవించవచ్చు. మురుండా లడ్డు కేవలం స్వీట్ మాత్రమే కాదు, ఇది చేతివృత్తుల వారి కళ , వారి తరాల కృషి ఫలితం. మేకింగ్ ప్రక్రియలో అడుగడుగునా సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తారు, ఈ లడ్డును ప్రత్యేకంగా విలక్షణంగా మారుస్తుంది. సంవత్సరంలో 2 నెల మాత్రమే అందుబాటులో ఉంటుంది.

లడ్డు ప్రత్యేకత ఏంటంటే.. ఏడాదికి ఒకసారి చాలికంలో సమయంలో మాత్రమే మార్కెట్‌లో దొరుకుతుంది. ఈ పరిమిత కాలం కారణంగా, ప్రజలు దీనిని రుచి చూసే ఏ అవకాశాన్ని వదులుకోరు. నారాయణఖేడ్ ,పిట్లం , కంగ్టి లోని మార్కెట్‌లోకి ఈ లడ్డు వచ్చినప్పుడు, దాని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది, దానిని కొనుగోలు చేయడానికి సంతలో ప్రజలు ఎగబడుతారు. విశేషమేమిటంటే మురుండా లడ్డు కంగ్టి , ఖేడ్ , పిట్లం లో ప్రసిద్ధి చెందిన స్వీట్, అయితే దీనిని తయారు చేసే వారు కర్ణాటక బీదర్ చెందినవారు. మార్కెట్‌లో మురుండా లడ్డు ధరలు మారుతూ ఉంటాయి. ఈ స్వీట్ కిలో ₹ 160 నుంచి ₹ 250 వరకు లభిస్తుంది. ఇది మీ అభిరుచిని సంతృప్తిపరచడమే కాకుండా చేతివృత్తుల వారి శ్రమ , సంప్రదాయాన్ని మీరు అనుభవించేలా చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed