రాజన్న సన్నిధిలో భక్తుల ఆందోళన

by Shyam |
రాజన్న సన్నిధిలో భక్తుల ఆందోళన
X

దిశ, వేములవాడ: మహాశివరాత్రి పర్వదినాన రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండుగంటల పాటు భక్తులను క్యూలైన్లలోనే నిలబెట్టి దర్శనానికి అనుమతించకపోవడంతో భక్తులు పోలీసులు డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. చంటి పిల్లలతో పాటు రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన తమను క్యూలెన్లలోనే వెయిట్ చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. చిన్న పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చివరకు ఓ భక్తుడు పోలీసు అధికారి కాళ్లు పట్టుకున్న సంఘటన కలకలం సృష్టించింది.

అందరికీ కామన్…

నిత్యం రద్దీతో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా చిన్నారులకు, వికలాంగులకు, వృద్దులకు ప్రత్యేక సమయం కేటాయించి సులువుగా దర్శనం చేయించేందుకు ఏర్పాటు చేశారు. కానీ వేములవాడలో మాత్రం దేవాదాయ అధికారులు ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. కనీసం మహాశివరాత్రి వంటి పర్వదినాల రోజున అయినా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే బావుంటుందని భక్తులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed