- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీడీపీతోనే మైనార్టీల అభివృద్ధి: చంద్రబాబు
దిశ, తెలంగాణ బ్యూరో: టీడీపీతోనే మైనార్టీల అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో కార్వాన్ కు చెందిన పలువురు ముస్లింలు ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింల అభ్యున్నతికి టీడీపీ చేసిన కృషిని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లో మతకలహాలను అరికట్టి మత సామరస్యానికి కృషి చేశామన్నారు. హజ్ భవన్ నిర్మాణం, ముస్లింల సంక్షేమం కోసం అనేక వెల్ఫేర్ స్కీమ్ లను టీడీపీ పాలనలోనే ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రొ. అన్వర్ ఖాన్ తోపాటు పార్టీలో చేరినవారిలో ముజాహిద్ ఖాన్, మీరజ్ ఖాన్, రిజవానుల్లా ఖాన్, శహబాస్ ఖాన్, జహంగీర్ ఖాన్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రాంమోహన్ రావు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు సామా భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి షేక్ ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.