అయ్యా సిద్దిపేట కలెక్టర్ గారు.. మమ్మల్ని పట్టించుకోండి..!

by Shyam |   ( Updated:2021-09-01 00:08:27.0  )
అయ్యా సిద్దిపేట కలెక్టర్ గారు.. మమ్మల్ని పట్టించుకోండి..!
X

దిశ, హుస్నాబాద్: అయ్యా కలెక్టర్ గారు.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామాన్ని సందర్శించి.. మా సమస్యలు తీర్చండి.. అంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి దేవక్కపల్లి గ్రామాభివృద్ది దినదినం కుంటుపడిపోయిందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజాప్రతినిధులు గ్రామానికొచ్చి పెన్షన్లు, కమ్యూనిటీ భవనాలు, రైతులను అన్నీ విధాలుగా ఆదుకుంటామని హామీలు ఇస్తున్నారని.. అనంతరం గ్రామానికి చేస్తున్న అభివృద్ధి మాత్రం శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని నిరుపేదలకు డబుల్ బెడ్‌ రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇప్పించాలని పలు మార్లు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ.. పట్టించుకున్న పాపానపోలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామాభివృద్ధికి రూపకల్పన చేయాలని.. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రావుల రంగారెడ్డి, దేవక్కపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed