నా కూతురి పెళ్లికి తప్పక రాగలరు.. ‘చిరు’ను కలిసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

by Shyam |
నా కూతురి పెళ్లికి తప్పక రాగలరు.. ‘చిరు’ను కలిసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
X

దిశ, సికింద్రాబాద్ : తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సోమవారం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కూతురు వివాహా ఆహ్వాన పత్రికను అందజేసి తప్పకుండా రావాలని ఆహ్వానించారు. పద్మారావు గౌడ్ కూతురు మౌనిక వివాహం అవినాశ్‌తో ఈనెల 11 తేదిన సికింద్రాబాద్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ క్రమంలోనే పద్మారావు గౌడ్ మెగాస్టార్ చిరుకు ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువనేత త్రినేత్ర గౌడ్‌తో పాటు పలుఫురు నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed