High Court: పోలింగ్ బూత్‌ల వద్ద మొబైల్ ఫోన్లపై నిషేధంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   ( Updated:2024-11-18 11:01:59.0  )
High Court: పోలింగ్ బూత్‌ల వద్ద మొబైల్ ఫోన్లపై నిషేధంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించడం చట్టవిరుద్ధం కాదని బాంబే హైకోర్టు (Bombay High Court) స్పష్టం చేసింది. ఎల్లుండి జరగనున్న మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Elections) పోలింగ్ బూత్‌ల (Polling Booth) వద్ద మొబైల్ ఫోన్లను (Cell Phone) ఉపయోగించకూడదని భారత ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే పోలింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ ముంబయి కి చెందిన న్యాయవాది ఉజాలా యాదవ్ ‘డిజిలాకర్‌’ (Digi Locker) యాప్‌ సాయంతో ఎన్నికల సిబ్బందికి గుర్తింపు పత్రాలు చూపించేందుకు వీలుగా పోలింగ్‌ కేంద్రాల్లోకి ఫోన్‌లను అనుమతించాలని బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ అమిత్ బోర్కర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా ఈసీఐకి అధికారాలు ఉన్నాయని పేర్కొంటూ ఈ పిల్ ను కొట్టి వేసింది. ఈసీ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి చట్టవ్యతిరేకత లేదని స్పష్టం చేసింది.

Next Story