- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుష్టశక్తుల వల్లే రాష్ట్రంలో అలజడి : ధర్మాన కృష్ణదాస్
దిశ, విశాఖపట్నం : కొన్ని దుష్ట శక్తులు రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా ప్రత్యక్ష దైవమైన అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని డిప్యూటీ సీఎం దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీని ప్రజలు మరిచిపోతున్నారనే భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయని, వారికి దేవుడి పట్ల భయం, భక్తి లేవు అన్నారు. ఓట్ల కోసం తప్ప.. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం వారికి రాదున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకే వారు కుట్రలు పన్నుతున్నారని, విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనకు బాధ్యులైన వారు ఎవరనేది ప్రాథమికంగా నిర్ధారణ అయిందన్నారు. గుడిపై దాడులతో ఎవరికి లాభం..? ఎవరిని లక్ష్యంగా చేసుకుని వారు ఈ దుర్మార్గాలు చేస్తున్నారో, ప్రజల విశ్వాసాలను దెబ్బతీసి విష ప్రచారంతో లబ్ధికే కుట్రలు చేస్తున్నట్లుందన్నారు. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో ప్రజలు ఆలోచించాలన్నారు.