ఎలాగైనా కియారాను పెళ్లి చేసుకుంటా

by Shyam |   ( Updated:2020-12-11 06:19:27.0  )
ఎలాగైనా కియారాను పెళ్లి చేసుకుంటా
X

దిశ, వెబ్‌డెస్క్: కౌన్ బనేగా కరోడ్ పతిషోలో పార్టిసిపేట్ చేశాడు మధ్యప్రదేశ్‌కు చెందిన విజయ్ పాల్ సింగ్ రాథోడ్. పోలీస్ అధికారి కావడమే తన లక్ష్యం కాగా, డెలివరీ బాయ్‌గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అయితే బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాంలో పాల్గొనే ఛాన్స్ కొట్టేసిన తను.. రూ.కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లాడు.

ఈ క్రమంలో కాస్త రిలాక్సేషన్ కోసం బచ్చన్ జీ ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని ప్రశ్నించగా.. ఏ మాత్రం మొహమాటం లేకుండా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు. తనంటే చాలా క్రష్ అని.. ఎలాగైనా, ఎప్పటికైనా తనను పెళ్లి చేసుకుంటానని చాలా గట్టిగానే చెప్పాడు విజయ్ పాల్. కియారా అద్వాణీ నటించిన ‘ఇందూ కీ జవానీ’ ఇవాళ రిలీజ్ అయింది. ఆమె ఫీమేల్ లీడ్ రోల్ చేస్తున్న ‘జగ్ జగ్ జీయో’ షూటింగ్‌ కొనసాగుతుంది.

Advertisement

Next Story