Delhi Unlock 2.0 : ఢిల్లీలో షాపింగ్ మాల్స్‌కి గ్రీన్ సిగ్నల్

by Shamantha N |   ( Updated:2021-06-05 03:04:45.0  )
Delhi Unlock 2.0 : ఢిల్లీలో షాపింగ్ మాల్స్‌కి  గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో అరవింద్ కేజ్రీవాల్ లాక్ డౌన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 400 కేసులే నమోదయ్యాయని, పాజిటివిటీ రేటు 0.5 శాతంగా ఉండటంతో లాక్ డౌన్‌ను భారీ సడలింపులతో కొనసాగితస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు జూన్ 14 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సడలింపులలో భాగంగా సోమవారం నుంచి షాపింగ్ మాళ్లు, మార్కెట్లను సరి, బేసి విధానంలో తెరుచుకోవచ్చని చెప్పారు. ఉదయం పదింటి నుంచి సాయంత్రం 8 గంటలకు షాపులను తెరవ వచ్చని తెలిపారు. 50 శాతం ప్రయాణీకులతో మెట్రో నడపాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది మాత్రమే హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కామర్స్ సేవలనూ ప్రారంభించుకోవచ్చని చెప్పారు. మరిన్ని సడలింపులను రాబోయే రోజుల్లో ప్రకటిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed