- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ నుంచి ఇంటి బాట పట్టిన రైతన్న.. కేంద్రం కీలక ప్రకటన!
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం అమలు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించిన విషయం తెలిసిందే. దాదాపు 15 నెలల పాటు రైతులు నిరసన తెలిపారు. కేంద్రం తెచ్చిన చట్టాలు రైతులకు అన్యాయం చేసే నల్ల చట్టాలని, కార్పొరేట్‌కు లబ్ది చేకూర్చే చట్టాలని, వాటిని వెంటనే రద్దు చేయాలంటూ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఉద్యమం చేశారు. వారి దెబ్బకు ఎట్టకేలకు కేంద్రం వెనకడుగు వేసింది. మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ రైతులు మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండి తమ డిమాండ్‌లను తీర్చాలని కోరారు.
ప్రతి రైతుకు మద్దతు ధర వస్తుందని లీగల్ గ్యారెంటీ ఇవ్వాలని, ఇప్పటి వరకు తమ రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వారు కోరిన విధంగానే మోడీ ప్రభుత్వం రాజీ మార్గాన్ని ఎంచుకుంది. ఈ మేరకు ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడిన రైతుల నాయకుడు రాకేష్ టికాయిత్ తెలిపారు. అంతేకాకుండా తాము ఇక్కడి నుంచి వెళ్లేందుకు 4-5 రోజులు పడుతుందని, చిన్న చిన్న గ్రూపులుగా అందరూ వెళుతున్నారని ఆయన తెలిపారు.
అంతేకాకుండా ఆయన డిసెంబర్ 15న తిరిగి వెళ్లనున్నట్లు తెలిపారు. అయితే కేంద్రం కిసాన్ మోర్చకు రైతుల డిమాండ్లకు సంబంధించిన రాత పూర్వక లేఖ పంపిన తరువాతనే రైతులు ఇంటి బాట పట్టారు. ‘రైతులకు మద్దతు ధర వచ్చేలా చూసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో ప్రభుత్వ అధికారులతో పాటు, వ్యవసాయ నిపుణులు ఉంటారు’ అని కేంద్రం తన లేఖలో పేర్కొంది.