‘రైతులు వద్దన్న వినలేదు.. హింస చెలరేగింది’

by Anukaran |
‘రైతులు వద్దన్న వినలేదు.. హింస చెలరేగింది’
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధానిలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో రైతుల రణం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. అయితే, ఈ వ్యవహారంపై ఢిల్లీ సీపీ శ్రీ వాత్సవ వివరణ ఇచ్చారు. ట్రాక్టర్ ర్యాలీలో రైతులు అన్ని నిబంధనలను ఉల్లంఘించారని చెప్పారు. నిర్దేశించిన ర్యాలీలో కాకుండా మరో మార్గంలో కూడా ర్యాలీ నిర్వహించారని చెప్పారు. ర్యాలీ కోసం కేవలం 5 వేల ట్రాక్టర్లకు మాత్రమే అనుమతి ఇచ్చామని.. రిపబ్లిక్ డే రోజు ర్యాలీ వద్దన్న రైతులు వినలేదని చెప్పుకొచ్చారు. జనవరి 25 సాయంత్రానికే రైతు సంఘాలు మాట తప్పాయని.. మిలిటెంట్, అతివాద శక్తులకు స్టేజీని అప్పగించారని శ్రీవాత్సవ తెలిపారు. అనవసర ప్రసంగాలతో రైతు సంఘాల నేతలు కూడా రెచ్చగొట్టారని.. దీని కారణంగా హింస చెలరేగి 394 మంది పోలీసులకు గాయాలు కావడానికి కారణమయ్యారన్నారు. మొత్తం 30 పోలీస్ వాహనాలను ఆందోళనకారులను ధ్వంసం చేశారన్నారు.

Advertisement

Next Story

Most Viewed