తడబడి.. నిలబడి.. 184/6

by Anukaran |   ( Updated:2020-10-09 10:32:34.0  )
తడబడి.. నిలబడి.. 184/6
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 23 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత తడబడిన చివరి వరకు పోరాడి మంచి స్కోర్‌ను నిర్ధేశించింది. ఓపెనర్లు చేతులెత్తేసినా.. మిడిలార్డర్లు హెట్మెయర్(45), స్టోయినిస్(39) పరుగులతో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. కాగా, ఢిల్లీ ఆటగాళ్లు క్రీజులో ఉన్నది కాసేపయినా బంతులను బౌండరీ పారించి.. పెవిలియన్ చేరారు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 184 పరుగులు చేయగలిగింది. ఓపెనర్లను ఆదిలోనే కుప్పకూల్చిన జోఫ్రా ఆర్చర్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు.

ఇన్నింగ్స్ సాగిందిలా..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. ముఖ్యంగా ఓపెనర్లు శిఖర్ ధావన్(5), పృథ్వీ షా(19)లకే ఔట్ అయ్యారు. 20 పరుగులు మించకుండా ఓపెనర్లు పెవిలియన్ చేరితే.. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ (22) పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. దీంతో తొలి 6 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి ఢిల్లీ స్కోర్ 51/3గా ఉంది.

ఇక మిడిలార్డర్‌లో వచ్చిన పంత్‌ కూడా వారి బాటలోనే నడిచాడు. 9 బంతులు ఆడి 5 పరుగులు చేసిన పంత్‌ కూడా రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. దీంతో 79 పరుగుల వద్ద ఢిల్లీ 4 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆ తర్వాత 5-6వ స్థానాల్లో వచ్చిన స్టోయినిస్(39), షిమ్రాన్ హెట్మెయర్(45) పరుగులతో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. సరిగ్గా ఇదే సమయంలో రాహుల్ తివాతెయ వేసిన బంతిని షాట్ ఆడబోయిన స్టోయినిస్ స్టీవ్‌ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇక హెట్మెయర్ బౌండరీలు బాదుతూ.. హాఫ్ సెంచరీ చేసే ప్రయత్నంలోనే ఔట్ అయ్యాడు. కార్తీక్ త్యాగి వేసిన బంతిని సిక్స్ కొట్టబోయే సమయంలోనే బౌండరీ వద్ద ఉన్న తివాతెయ క్యాచ్ పట్టాడు. దీంతో 149 పరుగుల వద్ద ఢిల్లీ 6 వికెట్ల(టాప్‌ ఆర్డర్‌)ను కోల్పోయింది.

ఇక లోయర్ ఆర్డర్‌లో వచ్చిన హర్షల్ పటేల్ (16), అక్సర్ పటేల్ (17) పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా (2), రవిచంద్రన్ అశ్విన్ (0)తో నాటౌట్‌గా నిలిచారు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో ఢిల్లీ 184 పరుగులు చేసింది.

స్కోరు బోర్డు:

Delhi Capitals Innings:
1. పృథ్వీ షా c and b జోఫ్రా ఆర్చర్ 19(10)
2. శిఖర్ దావన్ c జైస్వాల్ b జోఫ్రా ఆర్చర్ 5(4)
3. శ్రేయాస్ అయ్యర్ (c) (రనౌట్) జైస్వాల్ 22(18)
4. రిషబ్ పంత్ (wk) రనౌట్ ((sub)వోహ్ర/తివాతెయ) 5(90)
5.మార్క్యూస్ స్టోయినిస్ c స్టీవ్ స్మిత్ b రాహుల్ తెవాతియ 39(30)
6. షిమ్రాన్ హెట్మెయర్ c తివాతెయ b కార్తీక్ త్యాగి 45(24)
7.హర్షల్ పటేల్ c తివాతెయ b జోఫ్రా ఆర్చర్ 16(15)
8.అక్సర్ పటేల్ c జోస్ బట్లర్ b ఆండ్రూ టై 17(8)
9.కగిసో రబాడా not out 2(3)
10.రవిచంద్రన్ అశ్విన్ not out 0(1)
11….NOT YET BAT…
ఎక్స్‌ట్రాలు: 14
మొత్తం స్కోరు: 184 (8 wkts, 20 Ov)

వికెట్ల పతనం:
12/1 (శిఖర్ దావన్, 1.3), 42/2 (పృథ్వీ షా, 4.2), 50/3 (శ్రేయాస్ అయ్యర్, 5.5), 79/4 (రిషబ్ పంత్, 9.2), 109/5 (మార్క్యూస్ స్టోయినిస్ 13.3), 149-6 (షిమ్రాన్ హెట్మెయర్, 16.6),181-7 (అక్సర్ పటేల్, 18.6), 183-8 (హర్షల్ పటేల్, 19.4)

బౌలింగ్:
1. వరుణ్ ఆరోన్ 2-0-25-0
2. జోఫ్రా ఆర్చర్ 4-0-24-3
3. కార్తీక్ త్యాగి 4-0-35-1
4. ఆండ్రూ టై 4-0-50-1
5. శ్రేయస్ గోపాల్ 2-0-23-0
6. రాహల్ తివాతెయ 4-0-20-1

Advertisement

Next Story