గెలిచినా, ఓడినా నాదే బాధ్యత: మనోజ్ తివారీ

by Ramesh Goud |
గెలిచినా, ఓడినా నాదే బాధ్యత: మనోజ్ తివారీ
X

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి స్పందించారు. ఫలితాలపై నిరాశ చెందడం లేదన్నారు. ఫలితాలపై పూర్తి బాధ్యత తనదే అన్నారు. ఇవి తుది ఫలితాలు కావని, బీజేపీ పుంజుకునే అవకాశం ఉన్నట్లు తివారీ పేర్కొన్నారు. కాగా, కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆప్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతుంది. న్యూఢిల్లీ, ఉత్తర, సెంట్రల్, దక్షిణ ఢిల్లీలలో ఆప్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వాయువ్య, ఈశాన్య ఢిల్లీలో బీజేపీ తన ప్రభావాన్ని చూపుతోంది. ఇక కాంగ్రెస్ అసలు ఉనికిలోనే లేకపోవడం గమన్హారం.

Advertisement

Next Story

Most Viewed