కడుపు నింపేందుకు ‘కళ’ను అమ్ముతున్న ఐదేళ్ల చిన్నారి

by  |
కడుపు నింపేందుకు ‘కళ’ను అమ్ముతున్న ఐదేళ్ల చిన్నారి
X

దిశ, వెబ్ డెస్క్: లాక్డౌన్ వలస కూలీలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇంటికి వెళ్లలేక.. ఉన్న చోట ఉండలేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల పరిస్థితిని గమనించిన ఓ ఐదేళ్ల చిన్నారి. వాళ్ల ఆకలి తీర్చాలనుకుంది. అందుకోసం.. తన పిగ్గీ బ్యాంకును ఇవ్వాలనుకుంది. కానీ చూస్తే.. అందులో డబ్బులు తక్కువగా ఉన్నాయి. వాటితో ఏం చేయలేమని తను అనుకున్నది. దాంతో తను బొమ్మలు గీసి, వాటిని అమ్మేయగా వచ్చిన డబ్బులతో వలస కూలీల కడుపు నింపాలనుకుంది.

ఢిల్లీకి చెందిన ఐదేళ్ల చిన్నారి అరణ్య దత్ బేడీకి బొమ్మలు వేయడమంటే చాలా ఇష్టం. కరోనా వేళ.. ఇంట్లోనే ఉండాలని తెలియజేసేలా ఓ చిత్రం గీసింది. తను డోర్ పక్కన నిల్చుని చూస్తుంటే.. ఆ ఇంటి బయట గ్రీన్, రెడ్ రంగుల్లో కరోనా వైరస్ కాచుకుని ఉంటుంది. ఇలా తన ఆలోచనలకు చక్కని రూపమిస్తుంటుంది. అలాగే కథలు కూడా బాగా చెబుతుంది. తను రోజూ వాళ్ల బాల్కనీలో ఆడుకుంటోంది. వాళ్ల ఇంటికి ఎదురుగానే ప్రభుత్వ పాఠశాల ఉంది. అందులోనే వలస కూలీలకు ఆశ్రయం కల్పించింది ప్రభుత్వం. ‘నేను మా బాల్కనీ నుంచి ఎంతోమంది ఆకలితో ఉండేవాళ్లను చూశాను. వాళ్లనే పేదలని అంటారు. కేవలం అన్నం తినడం కోసమే.. వాళ్లంతా బారులు తీరిన లైన్లలో నిలుచుంటారు. నేను వాళ్ల కోసమే ఈ పుస్తకంలో బొమ్మలు గీశాను . ఆన్ లైన్ లో వాటిని అమ్మేయగా వచ్చిన డబ్బులతో వారికి ఫుడ్ అందించాలనుకుంటున్నాను’ అని అరణ్య తెలిపింది. చిన్నారి ఆన్ లైన్ పోస్ట్ చూసిన.. అక్షయపాత్ర, యునిసెఫ్ లు అరణ్యకు సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. అరణ్య వేసిన బొమ్మల పుస్తకాలు అమ్మగా వచ్చిన డబ్బులు నేరుగా ఆ రెండు ఎన్ జీవో సంస్థల్లో ఏదో ఒక దానికి వెళతాయి. ఆ సంస్థలు వలస కూలీలకు ఆహారం అందిస్తారు. ఇప్పటి వరకు అరణ్య లక్ష రూపాయల వరకు సంపాదించింది. ‘అరణ్య ఇప్పటికే పది పుస్తకాలు కంప్లీట్ చేసింది. మరిన్ని ఆలోచలను పుస్తకాలుగా తీసుకువచ్చే పనిలో ఉంది. లాక్డౌన్ వల్ల నిజంగా వలస కూలీలు, పేదలు చాలా బాధపడుతున్నారు. దుర్భర జీవితం గడుపుతున్నారు’ అని అరణ్య తండ్రి పేర్కొన్నారు.

tags : illustrations, book, aranya dutt, migrant labours, food, poor people


Next Story

Most Viewed