దారుణం: బలవంతంగా పురుగుల మందు తాగించి..

by srinivas |
దారుణం: బలవంతంగా పురుగుల మందు తాగించి..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ జంటలపై బంధువుల దాడులు పెరిగిపోతున్నాయి. రోజూ ఎక్కడో ఒక్కచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చివరికి చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సీతారామపురంలో ఒక ప్రేమజంటపై బంధువులు దాడికి దిగారు. ప్రేమజంటపై అమ్మాయి తరపు బంధువులు పరువు హత్యకు ప్రయత్నించారు. అమ్మాయి నోట్లో బలవంతంగా పురుగుల మందు వేశారు.

ఈ ఘటనలో బాధితురాలు అనిత పరిస్థితి విషమంగా మారింది. దీంతో బాధితురాలిని ఆత్మకూరు ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed