విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎంతో చర్చిస్తాం

by Shyam |
విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎంతో చర్చిస్తాం
X

దిశ, న్యూస్‌బ్యూరో : విద్యుత్ ఛార్జీల పెంపు అంశాన్ని సీఎంతో చర్చించిన తర్వాత నిర్ణయిస్తామని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి చెప్పారు. ఈ సమ్మర్‌లో 15వేల మెగావాట్ల దాకా డిమాండ్ వచ్చినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎస్సారెస్పీ రెండో విడత కాలువ నిర్మాణంపై హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్) కార్యాలయంలో సోమవారం మంత్రి రివ్యూ జరిపారు. ఇన్ని రోజులు నీళ్లు రావనుకున్న సూర్యాపేట జిల్లాకు ఈరోజు నీళ్లివ్వగలిగామన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత విద్యుత్ డిమాండ్ రెట్టింపైందన్నారు. కొత్తగా 40 లక్షల విద్యుత్ కనెక్షన్‌లు ఇచ్చామని వివరించారు. ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని సీఎం కేసీఆర్ ముందే ఊహించి ఆదేశించడంతో దానికి తగ్గట్లు విద్యుత్ శాఖ సిద్ధమైందన్నారు.

Tags : power charges increased, g.jagadish reddy, srsp, power demand

Advertisement

Next Story

Most Viewed