- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రూ.600 కోట్ల రుణాలు
by Shyam |
X
దిశ ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో సహకార సంఘాలు నిలదొక్కుకునేందుకు గత 32 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా డీసీసీబీ బ్యాంకు ఆధ్వర్యంలో రైతులకు రుణమేళా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో పాటు మహేందర్ రెడ్డి రైతులకు రుణ మంజూరు పత్రాలు, రుణమాఫీ చెక్కులను అందజేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు రూ. 600 కోట్ల రుణాలు మంజూరయ్యాయని మహేందర్ రెడ్డి వెల్లడించారు. వీటిలో రూ.80 కోట్లను రైతులకు స్వల్పకాలిక రుణాల కింద ఇచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తం 107 సహకార సంఘాల్లో ఒకొక్క సంఘానికి రూ. 60 లక్షలను కేటాయించామన్నారు. రైతులకు నేరుగా రుణాలు అందేలా మండల సహకార సంఘాల ఛైర్మన్లు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Advertisement
Next Story