- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాండమిక్ రోజుల్లో డేటింగ్?
దిశ, వెబ్‌డెస్క్: పాండమిక్ రోజుల్లో అన్నింటికీ దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అటు వృత్తిగత పనులతోపాటు ఇటు వ్యక్తిగత పనులు కూడా ప్రారంభించాల్సిన సమయం వచ్చేసింది. ఆ క్రమంలో డేటింగ్ కూడా పునఃప్రారంభించాల్సిన సమయం వచ్చేసిందని సింగిల్ యువత నిర్ణయానికి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఫిజికల్‌గా కలిసే డేటింగ్ కంటే వర్చువల్ డేటింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఒక్కసారి రిలేషన్‌షిప్ కన్ఫర్మ్ అయ్యాక మాత్రం ఇక వర్చువల్ మీటింగ్‌కు స్వస్తి చెప్పాల్సిందేనని వారు గట్టిగా నమ్ముతున్నారు. లేకపోతే ఆ రిలేషన్‌షిప్ బలంగా మారదని సింగిల్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే డేటింగ్ ప్రారంభించడానికి పాటించాల్సిన కొన్ని సూచనలు ఉన్నాయి. బార్లలో, హోటళ్లలో, రెస్టారెంట్లలో, సినిమా హాళ్లలో కలవడం ఒకప్పటి మాట. ఒకవేళ ఇప్పుడు కలిసినా భౌతిక దూరం పాటించక తప్పదు. కాబట్టి ఈరోజుల్లో డేటింగ్ కోసం పాత విధానాలు పనికిరావు. కాబట్టి వీలైనంత ప్రేమను వర్చువల్‌గానే కురిపించే ప్రయత్నం చేయాలి.
వీడియో కాల్స్, ఆడియో కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లలోనే మనసు విప్పి మాట్లాడాలి. అలాగే పాండమిక్ కారణంగా జీవితాల్లో వచ్చిన మార్పు గురించి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. పరిస్థితులు బాగోలేని కారణంగా ప్రతి ఒక్కరిలోనూ ఒక సంకోచ స్వభావం అలవడింది. కాబట్టి రిలేషన్‌షిప్‌లో ఎదుటి వ్యక్తి ఓపెన్ అయ్యేవరకు వాళ్లను అర్థం చేసుకోగలగాలి. అంతేగాకుండా వర్చువల్ కాకుండా రియల్ లైఫ్‌లో మీట్ అవడానికి ఒక సమయాన్ని పెట్టుకోవాలి.
ఆ నిడివిలో పూర్తిగా వారితోనే గడపాలి. అప్పుడు ఫోన్‌లో మెసేజ్‌లు చూడటం, చాటింగ్ చేయడం చేయవద్దు. ఇలా నేరుగా కలిసిన ఒకటి రెండు సార్లైనా సమయాన్ని మొత్తం వాళ్లకే కేటాయిస్తే, మీరు వారి మీద చూపించే ప్రేమను పరోక్షంగా వెల్లడించినట్లవుతుంది. ఇంకా పాండమిక్‌కు అనుగుణంగా మీ డేటింగ్‌ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ రిలేషన్‌షిప్‌ను శాశ్వతం చేసుకునేందుకు ప్రయత్నించాలి.