డేట్ ఫిక్స్.. విద్యార్థులకు ఫిజికల్ క్లాసెస్ ప్రారంభం

by Shyam |
Physical classes
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫిజికల్ క్లాసెస్ ను 8వ తరగతి నుంచి పీజీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. మొదటగా నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలను ప్రారంభించి వారం రోజుల తరువాత 8,9,10 తరగతులకు ఫిజికల్ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ఇప్పటికే ఫిజికల్ క్లాసులను ప్రారంభించిన ఇతర రాష్ట్రాలను అధ్యాయనాలు చేయాలని నిర్ణయించింది. 15 రోజుల పాటు పర్యటనలు చేపట్టేందుకు అధికారుల బృంధాలను ఏర్పాటు చేస్తున్నారు. పరిశీలనల ఆధారంగా సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ తరగతులను నిర్వహించనున్నారు.

విద్యార్థుల భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఫిజికల్ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించింది. విద్యాశాఖ అందించిన నివేధికలను పరిశీలించిన ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ గా తరగతులను నిర్వహించాలని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అయితే తరగతులను ఏ విధంగా నిర్వహించాలి, వైరస్ వ్యాప్తి జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలను పరిశీలిస్తున్నారు. సమగ్రంగా విచారించి, నిపుణుల అభిప్రాయాలు సేకరించి తది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే తరగతులను ప్రారంభించిన ఇతర రాష్ట్రాల్లో పర్యటనలు చేపట్టనున్నారు.

15రోజుల పాటు ఇతర రాష్ట్రాల్లో పర్యటనలు

ఫిజికల్ క్లాసెస్ ను ప్రారంభించిన రాష్ట్రాల్లో పరిశీలనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 15 రోజుల పాటు పర్యటనలు చేపట్టి తరగతుల నిర్వహణ, వైరస్ కట్టడికి చేపట్టిన జాగ్రత్తలు వంటి అంశాలను నమోదు చేసుకొవాలని సూచించారు. పర్యటనలు చేపట్టేందుకు అధికారుల బృంధాలను ఏర్పాటు చేసే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది. ఇతర రాష్ట్రాల్లోని విధివిధానాల ఆధారంగా తరగతుల నిర్వహణపై నిర్ణయాలు తీసుకోనున్నారు.

మొదటగా ఇంటర్ టు పీజీ తరగతులు

సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. భౌతిక దూరం పాటించేలా, వైరస్ ను కట్టడి చేసేలా చర్యలు చేపట్టి తరగతులను నిర్వహించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ప్రవేశపెట్టి పరిశీలనలు చేపట్టనున్నారు. పరిస్థితల అనుకూలతనుబట్టి వారం రోజుల తరువాత 8,9,10 తరగతులను ప్రారంభించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed