దాసరి… దానం.. సమర్థత… రిపువర్గం లేని మహానుభావా…

by Jakkula Samataha |   ( Updated:2020-05-04 06:51:01.0  )
దాసరి… దానం.. సమర్థత… రిపువర్గం లేని మహానుభావా…
X

దర్శకరత్న దాసరి సత్యనారాయణ రావు… స్పృశించని అంశం లేదు.. తీయని సబ్జెక్ట్ లేదు.. కొత్త నటీనటులను ప్రోతాహించాడు.. స్టార్ డమ్ కట్టబెట్టాడు.. కనుమరుగైన నటీనటులను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు… కొత్తగా అవకాశాలు కల్పించి భరోసా ఇచ్చాడు… నటుడిగా నవరసాలు పలికించగలడు… దర్శకుడిగా నవరసాలను తెరకెక్కించనూ గలడు.. 140కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి రికార్డ్ సృష్టించిన ఆయన జన్మదినాన్ని డైరెక్టర్స్ డే గా ప్రకటించింది డైరెక్టర్స్ అసోసియేషన్. మే 4న ఆయన జయంతి పురస్కరించుకుని నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు సినీ ప్రముఖులు.

దాసరిని ధర్మార్జున, కర్ణలతో పోల్చిన చిరు..

ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండి కార్మికులను ఆదుకున్న దాసరి మరణం తీరని లోటని భావిస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి. దాసరి జయంతి పురస్కరించుకుని.. చివరి సారి తనను కలిసిన ఫోటోను షేర్ చేస్తూ నివాళులు అర్పించారు ఆయన. దాసరికి సరికొత్త అర్థం ఇస్తూ .. ట్వీట్ చేశారు. దాసరి అంటే…. దానంలో దానకర్ణుడు.. సమర్ధతలో అర్జునుడు.. రిపువర్గమేలేని ధర్మరాజుగా అభివర్ణించారు. మీరు లేకపోయినా మీ స్ఫూర్తి సజీవంగానే ఉంటుందని.. ప్రతిభ ఉన్న భావి దర్శకులకు జీవితానికి మార్గదర్శకం అవుతుందని తెలిపారు.

మీ సేవలు మరువం…

రెండు జాతీయ అవార్డులు, తొమ్మిది నంది అవార్డులు, నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందిన దాసరికి నివాళులు అర్పించారు దర్శకుడు మెహర్ రమేష్. డైరెక్టర్ గా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ది గ్రేట్ లెజెండ్ దాసరి… మీ సేవలు ఎన్నటికీ మరిచిపోలేమని స్మరించుకున్నారు.

ఆయన జీవితం ఆదర్శం..

తాత ఎన్టీఆర్ తో దాసరి చేసిన చిత్రాల్లో బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు అని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. అన్నిటికీ మించి నచ్చింది మనుషులంతా ఒక్కటే అని చెప్పారు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు… దర్శకుల అందరిలో దాసరి ట్రాక్, రూట్ వేరాన్నరు తారక్. ఆయన జీవితం ఎంతో మంది దర్శక, నటులకు ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు.

దాసరిని మిస్ అవుతున్నాం..

దాసరి కేవలం డైరెక్టర్, నటుడు కాదు.. ఆయన ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండేవారని తెలిపారు రామ్ చరణ్ తేజ్. అలాంటి వ్యక్తిని చాలా మిస్ అవుతున్నట్లు తెలిపారు. ఆయన సేవలు సినీ రంగం మరిచిపోదని… ఆయన సేవలు చిరస్థాయిగా ఉంటాయని తెలిపారు.

లైట్స్.. కెమెరా.. యాక్షన్.. ఉన్నంతవరకు మీరుంటారు…

తెలుగు ఇండస్ట్రీ దర్శకులంతా తమ గురువు దాసరికి నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. మీరు మాకు స్ఫూర్తి… లైట్స్, కెమెరా, యాక్షన్ పదాలు ఎప్పటి వరకు వినిపిస్తా యో… అప్పటి వరకు మీరు ఆ పదాలలో జీవిస్తూనే ఉంటారంటూ స్మరించుకున్నారు. దాసరి జయంతి సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ లో తన విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు నిర్మాత సి. కళ్యాణ్, దాసరి తనయుడు అరుణ్. ఈ సందర్భంగా అన్నదానం చేశారు.

నా తల్లిదండ్రులు పెట్టిన పేరు భక్తవత్సలం…నటుడిగా నాకు జన్మ ప్రసాదించిన గురువు దాసరి నారాయణ రావు 1975లో నాకు మోహన్ బాబుగా నామకరణం చేశారని తెలిపారు. ఒక విలన్ గా, ఒక కమెడియన్ గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఒక హీరోగా అన్ని రకాల పాత్రలు నాకిచ్చి… నన్ను ఇంతటి వ్యక్తిని చేసిన ఆ మహనీయుడు దాసరి అని స్మరించుకున్నారు. తండ్రి లాంటి తండ్రి దాసరి నారాయణరావు అని… ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, గురువుగారి ఆశీస్సులు మా కుటుంబానికి ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను అని తెలిపారు.

Tags: Chiranjeevi, Meher Ramesh, NTR, Dasari Narayana Rao, Ram Charan Tej

Advertisement

Next Story

Most Viewed