నష్ట‌పోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

by Shyam |
నష్ట‌పోయిన రైతులకు పరిహారం చెల్లించాలి
X

దిశ, రంగారెడ్డి: అకాల వర్షంతో జిల్లాల్లో నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నేతలు బుధవారం కలెక్టర్ ఆమోయ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. వరి, మొక్కజొన్న రైతులు వడగండ్ల వానతో చేతికొచ్చిన పంటను నష్టపోయారని కాంగ్రెస్ నేతలు కలెక్టర్‌కు వివరించారు. లాక్‎డౌన్ నేపథ్యంలో రేషన్ లబ్ధిదారులు, వలస కార్మికులకు పంపిణీ చేసిన బియ్యం తినే వీల్లేకుండా ఉన్నాయని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీ చల్లా వంశీ చందర్ రెడ్డిలు కలెక్టర్ అమోయ్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు.

Tags: Damaged farmers, compensated, congress leader, rangareddy

Advertisement

Next Story