- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓ కూలీ ‘రెక్స్‌చేంజ్’యాప్ తీసుకొచ్చాడు
దిశ, వెబ్‌డెస్క్: తినడానికి తిండిలేక పనసపండు విత్తనాలు తింటూ కాలం గడిపినా రోజుల నుంచి క్లాసులో మార్కులు బాగా తెచ్చుకున్నా..ప్రోత్సాహం దక్కని రోజుల వరకు ఎన్నెన్నో చేదు అనుభవాలు చవి చూసిన బినేష్ నేడు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేరళవాసి అయిన బినేష్ బాలన్ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన ఓ కూలీ కుటుంబంలో జన్మించాడు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ..అవమానాలను ఎదుర్కొని ముందుకు సాగాడు. కూలీవాడని సమాజం తన పట్ల వివక్ష చూపింది. అయినా అతను కుంగిపోలేదు. విద్యలోనే కాదు, జీవితం పెట్టిన పరీక్షలోనూ డిస్టింక్షన్‌లో పాసై..బ్రిటన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఎదిగాడు. బినేష్ జీవితం యువతకు ఆదర్శనీయం, ఆచరణీయం. తాజాగా ఓపెన్ బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేశాడు. ఆ విశేషాలు మీకోసం..
బినేష్ ఏడో తరగతిలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాడు. అమ్మాయితో కాదు ‘కంప్యూటర్’తో. తొలిసారి ఇంటర్నెట్ కేఫ్‌లో కంప్యూటర్ చూసింది మొదలు, ఆ క్షణం నుంచి కంప్యూటర్ గురించి నేర్చుకోవాలనే తపన అతడిలో పెరిగింది. పుస్తకాలు చదివి, నెట్‌లో శోధించి భిన్నమైన ప్రొగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడంతో పాటు, కంప్యూటర్ ఆపరేట్ చేయడం పూర్తిగా నేర్చుకున్నాడు. కాలం గడుస్తున్నా కొద్దీ, కంప్యూటర్‌లో ఆరితేరి, క్లాస్‌లో చాంప్‌గా నిలిచాడు.
లేబర్‌గా పనిచేస్తూ, తన చదువును కొనసాగిస్తూ ఎంబీఏ చేసిన బినేష్, ఆటంకాలను అధిగమించి కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్ సాయంతో యూకేలోని సస్సెక్స్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వెళ్లాడు. ప్రభుత్వమిచ్చే ఆ స్కాలర్‌షిప్ డబ్బులు సరిపోకపోవడంతో..ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు క్లీనింగ్ బాయ్‌గా పనిచేసి తన చదువును కొనసాగించాడు. చదువు కంప్లీట్ చేసి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా లైఫ్ ప్రారంభించిన బినేష్, ఎప్పటికైనా స్టార్టప్ స్థాపించాలని కలలుగన్నాడు. తన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెన్ బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్(రెక్స్‌చేంజ్)ను అభివృద్ధి చేసి విజయం సాధించాడు.
రెక్స్‌చేంజ్ సాఫ్ట్‌వేర్:
బినేష్, తన కొలిగ్ ఇడుక్కి సాయంతో ఫ్యూచర్ జనరేషన్ కోసం ‘రెక్స్‌చేంజ్’ అనే బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ రూపొందించాడు. ఇది భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ల మాదిరిగా పని చేయదు. రెక్స్‌చేంజ్ డబ్బు విలువను భారతీయ రూపాయల్లో కాకుండా, రెసిప్రొసిటీ లేదా ‘ఆర్‌వి(RV)’ అనే డిజిటల్ విలువలో నిల్వ చేస్తుంది. ‘ఆర్‌వి’ని ఉంచే ఖాతాను కూప్ బ్యాంక్ అకౌంట్ నంబర్ (CBAN)అని పిలుస్తారు, ఇది యూరో, డాలర్, పౌండ్ వంటి అధిక విలువ కలిగిన కరెన్సీ విలువలను నిల్వ చేయగలదు, అంతేకాదు ఇండియన్ కరెన్సీ(రూపాయి)లో విత్‌డ్రా చేసుకోవచ్చు. సీబీఏఎన్(CBAN) ఖాతా రెక్స్‌చేంజ్ యాప్ ద్వారా మాత్రమే ఇది పనిచేస్తుంది. ఈ యాప్ వారం క్రితం ప్రారంభించగా, ఇప్పటికీ 70 మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ‘ఆర్‌వి’ విలువను లైవ్ రెక్స్‌చేంజ్ రేట్ (LRR) నిర్ణయిస్తుంది. సీబీఏఎన్ ఖాతాల సంఖ్య పెరుగుదల ప్రకారం ఎల్ఆర్ఆర్ పెరుగుతుంది. ఆమ్‌స్టర్‌డమ్ యూనివర్సిటీలో సామాజిక, సాంస్కృతిక ఆంథాలజీ మీద బినేష్ 2019 నుంచి పరిశోధనలు చేస్తున్నాడు.