విద్యుదాఘాతంతో కూలీ మృతి

by Sumithra |
విద్యుదాఘాతంతో కూలీ మృతి
X

దిశ, డోర్నకల్: విద్యుదాఘాతానికి గురై ఓ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం సుబ్లేడు గ్రామానికి చెందిన బండారి ఎల్లయ్య(40) రోజు కూలీగా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ఓ వస్త్ర వ్యాపారి ఇంటి నిర్మాణ పనులను చేస్తున్నారు. పిల్లర్ గోతిలో నీటిని మోటార్ సహాయంతో తీస్తున్నారు. ఐతే మోటార్ వద్ద తీగ తెగి ఉండటంతో అక్కడే పని చేస్తున్న ఎల్లయ్య షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడికి భార్య, ఓ కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed