- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వెడ్డింగ్ వీల్’తో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
దిశ, ఫీచర్స్: ప్రతి వ్యక్తి జీవితంలో ‘పెళ్లి’ ఓ మరుపురాని అపురూప ఘట్టం. ఆ రోజు ప్రత్యేకంగా కనిపించేందుకు వధూవరులు స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఔట్‌ఫిట్స్ విషయంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. సైప్రస్‌కు చెందిన మరియా పరస్కేవ ఇందుకు మినహాయింపేం కాదు. తన పెళ్లి గౌనును ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోగా, పెళ్లి కూతురు ధరించే వీల్ (పాశ్చాత్య సంప్రదాయంలో తలపై ధరించే వస్త్రం)ను మరింత భిన్నంగా తయారు చేయించి, ప్రపంచ రికార్డు సృష్టించింది.
పరస్కేవ ధరించిన వీల్ పొడవు 6,962.6 మీటర్లు (22,843 అడుగులు 2.11 అంగుళాలు) ఉండగా, వివాహం జరిగిన స్టేడియం మొత్తాన్ని ఆ వస్త్రం కప్పేసింది. పరాస్కేవ వివాహ వీల్ 63 ఫుట్‌బాల్ స్టేడియాల పొడవుతో సమానం కాగా ఆమె వివాహ దుస్తులు, వీల్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. దీని తయారీకి 400 యూరోలు(రూ.34 వేలు) ఖర్చుఅయింది. దీన్ని పూర్తి పొడవుకు అమర్చడానికి ఆరు గంటల పాటు పట్టగా, 30 మంది వాలంటీర్లు ఇందుకోసం శ్రమించారు. అయితే వీల్ విప్పేందుకు వీలుగా, కస్టమ్ మేడ్ టూల్‌ని సృష్టించడం విశేషం. ఆ టూల్‌ను పికప్ ట్రక్ వెనుక భాగంలో జతచేసి, మైదానం మొత్తం పరిచారు. ఈ వీల్ ‘లాంగెస్ట్ వెడ్డింగ్ వీల్’గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందగా, సంస్థ తాజాగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఆమె వివాహం ఆమె అందమైన వెడ్డింగ్ వీల్ కంటే ఎక్కువ కాలం నిలిచి ఉండాలని, ఇది నిజంగా అద్భుతమని, ఇలాంటి ఐడియాలు అసలు ఎలా వస్తాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘చిన్నప్పటి నుంచి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బ్రేక్ చేయాలని కోరుకున్నాను. అది కూడా వెడ్డింగ్ వీల్ పేరిటే రికార్డ్ సృష్టించాలనుకోగా, అది నేటికి నిజమైంది. ఐ యామ్ సో హ్యాపీ’ అని పరస్కేవ తెలిపింది.