ఓయో రూమ్ ఏమో కానీ.. రూ. 3 లక్షలు హాంఫట్

by Sumithra |   ( Updated:2021-04-09 01:44:02.0  )
ఓయో రూమ్ ఏమో కానీ.. రూ. 3 లక్షలు హాంఫట్
X

దిశ, వెబ్‌డెస్క్: మనం ఒక పనిచేయబోయి.. చివరికి ఎదురుదెబ్బ తగిలితే తట్టుకోలేం. పెనం మీద నుంచి పోయ్యిలో పడినంతలా మన పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్‌కి చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఓయో రూమ్ బుక్ చేసుకుని ప్రశాంతంగా గడపాలని అనుకున్న అతడికి సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు.

హైదరాబాద్‌కు చెందిన ఉమేష్ ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇంట్లో కుటుంబసభ్యులు ఎక్కువమంది ఉండటం, అసలే కరోనా తీవ్రత పెరుగుతుండటంతో కొన్నిరోజుల పాటు ఓయో రూమ్‌లో ఉండాలనుకున్నాడు. దీని కోసం ఓయో ఫోన్ నెంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడు.

ఒక నెంబర్ దొరకగా దాని ఫోన్ చేశాడు. అయితే ఆ నెంబర్ నకిలీదని, సైబర్ నేరగాళ్లదని ఉమేష్‌కి తెలియదు. ఉమేష్ ఫోన్ చేయగానే సైబర్ నేరగాళ్లు ఓయో ప్రతినిధుల్లాగే మాట్లాడారు. మీకు రూమ్ బుక్ చేయాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ క్విక్ సపోర్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. ఆ యాప్ ద్వారా ఉమేష్ ఫోన్‌ను హ్యాక్ చేశారు.

రూమ్ బుక్ కావాలంటే రూ.10 వేలు పంపాలని కోరడంతో.. వాటిని ఉమేష్ ట్రాన్స్‌ఫర్ చేశాడు. అయితే ఉమేష్ ట్రాన్స్‌ఫర్ చేసే సమయంలో అతడి యూపీఐ వివరాలను తెలుసుకుని అకౌంట్ నుంచి రూ.3.08 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. దీంతో మహేష్ లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed