- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బూజు పట్టాయని.. స్వీట్ షాపు ముందు ఆందోళన
దిశ, ఎల్బీనగర్: బూజుపట్టిన స్వీట్లు విక్రయించారని ఓ స్వీట్ హౌస్ ముందు కొనుగోలుదారుడు ఆందోళన చేపట్టాడు. దీంతో మున్సిపల్ అధికారులు సదరు స్వీటుషాపు నిర్వాహకుడికి రూ.3 వేలు జరిమానా విధించారు. ఈ ఘటన కర్మాన్‌ఘాట్ చౌరస్తాలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుడు ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… ఈనెల 1న కర్మాన్ ఘట్‌లోని రాధే స్వీట్ హౌస్‌లో కలకాన్ స్వీట్లు కొనుగోలు చేశాడు.
మరుసటి రోజున ఇంటి వద్ద స్వీటు బాక్సును తెరిచి చూడగా బూజుపట్టి దుర్వాసన వెదజల్లుతున్నాయి. వెంటనే స్వీటుషాపు వద్దకు చేరుకుని యజమానిని నిలదీయగా తీసుకెళ్లిన రోజే తినాలి లేదంటే.. ఒక్క రోజు నిల్వ ఉంచినా బూజు వస్తుందని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో బాధితుడు ప్రవీణ్ రెడ్డి స్వీటుషాపు ముందు ఆందోళన చేపట్టాడు. కరోనా సమయంలో ఇలాంటి స్వీట్లు విక్రయిస్తే కొనుగోలుదారులు అనారోగ్యం బారిన పడతారని ఆవేదన వ్యక్తంచేశాడు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ ఇన్ స్పెక్టర్ మేఘనాథ్ షాపు యజమానికి జరిమానా విధించారు.