- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: మార్చి 20, 2023 ( గ్రూప్స్ 1,2,3,3 ..ఎస్ఐ/కానిస్టేబుల్)
అన్న్‌పూర్తి ధాన్యం ఏటీఎంలు ప్రారంభం
రేషన్‌కార్డు ఉన్న వినియోగదారులు కేవలం 30 సెకన్ల వ్యవధిలో బియ్యం, గోధుమలు తీసుకునేలా అన్న్‌పూర్తి ధాన్యం ఏటీఎంలు ప్రారంభమయ్యాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా మూడు ధాన్యం ఏటీఎంలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లఖ్‌నవూ సమీప జానకీపురంలో తొలి ఏటీఎం సిద్ధమైంది. దాదాపు 150 మంది వినియోగదారులకు ఇది సేవలందిస్తోంది. వినియోగదారులు ఈ యంత్రం మీద వేలిముద్ర వేయగానే 3 కేజీల బియ్యం, 2 కేజీల గోధుమలు వస్తాయి.
సీఐఐ తెలంగాణ ఛైర్మన్‌గా సి. శేఖర్‌రెడ్డి
భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), తెలంగాణ విభాగానికి నూతన ఛైర్మన్‌గా సి.శేఖర్ రెడ్డి ఎంపికయ్యారు. వైస్ ఛైర్మన్ గా డి.సాయి ప్రసాద్ వ్యవహరిస్తారు. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి వీరిద్దరూ సీఐఐ తెలంగాణ బాధ్యతలు నిర్వహిస్తారు.
టీసీఎస్‌కు తెలంగాణ ఇండస్ట్రీస్ పురస్కారం
తెలంగాణ రాష్ట్రంలో ఐటీ సేవల రంగానికి అందిస్తున్న సేవలకు గాను తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీ అవార్డ్ ఫర్ ఎక్స్ లెన్సీ ఇన్ ఐటీ పురస్కారానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎంపికయింది. సీఐఐ తెలంగాణ విభాగం వార్షిక సమావేశంలో ఈ పురస్కారాన్ని తెలంగాణ ఐటీ మంత్రి, కేటీఆర్ చేతుల మీదుగా టీసీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి.రాజన్న అందుకున్నారు.
భారతదేశ తలసరి ఆదాయం రూ. 1,72,000
భారతదేశ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద రూ. 1,72,000కు చేరిందని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్ఓ) వెల్లడించింది. ప్రధాని నేతృత్వంలో ఎన్‌డీఏ కూటామి అధికారంలోకి వచ్చిన నాటికి (2014-15) ఎన్ఎస్ఓ ప్రాకారం అది రూ. 86,647 గా ఉంది. ఈ లెక్కన దేశంలో సుమారుగా 99 శాతం వృద్ధి నమోదైంది. స్థిర ధరల వద్ద 2014 - 15లో దేశ తలసరి ఆదాయం రూ. 72,805 గా ఉంది. అది ప్రస్తుతం రూ. 98,118కి చేరింది. ఇందులో 35 శాతం వృద్ధి నమోదైంది.
శక్తి కాంత దాస్‌కు గవర్నర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం
రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కు గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023 పురస్కారం వరించింది. కరోనా సంక్షోభం, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వంటి క్లిస్ట పరిస్థితుల్లో మార్కెట్లను సమర్ధంగా నడిపించినందుకు అంతర్జాతీయ ప్రచురణ సంస్థ సెంట్రల్ బ్యాంకింగ్ ఈ అవార్డును అందించింది. శక్తికాంత దాస్ ప్రస్తుతం రెండో పర్యాయం ఆర్‌బీఐ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. కీలక సంస్కరణలు తీసుకురావడంతోపాటు ప్రపంచ స్థాయి చెల్లింపు వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో దాస్ కీలక పాత్ర పోషించారని వెల్లడించింది. 2015లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు మొదటిసారిగా ఈ అవార్డు దక్కింది.