కరెంట్ అఫైర్స్: నియామకాలు

by Harish |
కరెంట్ అఫైర్స్: నియామకాలు
X

నీతి ఆయోగ్ సభ్యుడిగా అర్వింద్ విర్‌మాని:

నీతి ఆయోగ్ పూర్తి స్థాయి సభ్యుడిగా ఫౌండేషన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ వెల్ఫేర్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అర్వింద్ విర్‌మాని నియమితులయ్యారు.

ఈ మేరకు కేబినెట్ సెక్రటేరియల్ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రథాన మంత్రి ఆమోదంతో ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొంది.


ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్:

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా పంజాబ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ బాధ్యతలు స్వీకరించారు.

దీంతో ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేలతో కూడిన కమిషన్ ల మూడో స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 31 తో పదవీ కాలం ముగుస్తుంది.


సీఐపీఎం సభ్యుడిగా వేణుగోపాల్ ఆచంట:

ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ వెయిట్స్ అండ్ మెజర్స్ (సీఐపీఎం) సభ్యుడిగా ఢిల్లీ సీఎస్ఐఆర్ - నేషనల్ ఫిజిక్స్ లేబొరేటరీ డైరెక్టర్ ప్రొఫెసర్ వేణుగోపాల్ ఆచంట ఎన్నికయ్యారు.

పారిస్‌లో జరిగిన 27వ సదస్సులో ఆయనను ఎన్నుకున్నారని కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ తెలిపింది.

ఇది సీఎస్ఐఆర్ - ఎన్‌పీల్‌కు గుర్తింపు తేవడమే కాకుండా, దేశంలో మెట్రాలజీ అభివృద్ధి దిశలో ఒక ముందడుగు అని పేర్కొంది.

వివిధ దేశాల నుంచి ఎన్నికైన 18 మందిలో ఆచంట ఒకరని తెలిపింది. ఈ పదవికి ఎంపికైన ఏడో భారతీయుడని పేర్కొంది.

Advertisement

Next Story