కరెంట్ అఫైర్స్: 3-1-2023

by Harish |
కరెంట్ అఫైర్స్: 3-1-2023
X

ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహు:

ఇజ్రాయెల్ నూతన ప్రధాన మంత్రిగా బెంజమిన్ నెతన్యాహు ప్రమాణ స్వీకారం చేశారు.

నెతన్యాహు ఇజ్రాయెల్‌లో ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేశారు.

దీంతో ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

నెస్సెట్(పార్లమెంట్)లోని 120 మంది సభ్యుల్లో నెతన్యాహుకు 64 మంది మద్దతు ఉంది.

ఆయనకు సొంత లికుడ్ పార్టీ సహా మరికొన్ని పార్టీల మద్దతు ఉంది.

దేశంలోని తలసరి రుణ భారంలో తెలంగాణకు 5వ స్థానం:

తలసరి రుణ భారంలో ఆంధ్రప్రదేశ్ రైతులు దేశంలో తొలి స్థానంలో నిలిచారు.

రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబంపై రూ. 2,45,554 అప్పు ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు.

జాతీయ స్థాయిలో ప్రతి రైతు కుటుంబం మీద రూ. 74,121 కోట్లు రుణం ఉంది.

తెలంగాణలో ప్రతి రైతు కుటుంబం పై రూ. 1,52,113 మేర రుణ భారముంది. ఇది దేశంలో 5వ స్థానంలో ఉంది.

ఎఫ్‌డిఐలలో తెలగాణకు 7వ స్థానం:

2022 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)లో ఏపీ 10వ, తెలంగాణ 7వ స్థానంలో నిలిచాయి.

ఈ తొమ్మిది నెలల్లో దేశంలోకి 42,509 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు రాగా అందులో ఏపీకి 217 మిలియన్ డాలర్లు మాత్రమే దక్కాయి.

తెలంగాణకు 1287 మిలియన్ డాలర్లు వచ్చాయి.

ఢిల్లీ మెట్రో కు 20 ఏళ్లు:

డిసెంబర్ 25, 2002న ఢిల్లీ మహానగరంలో అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఢిల్లీ మెట్రోరైలును ప్రారంభించారు.

ప్రారంభంలో కేవలం 8.2 కి.మీ పొడవున 6 స్టేషన్లతో ప్రారంభమయిన ఢిల్లీ మెట్రో నేడు 392 కి.మీలకు విస్తరించింది.

ప్రస్తుతం 286 స్టేషన్లు ఉన్నాయి. రోజుకు 16 నుంచి 18 గంటల పాటు ఈ రైళ్లు సేవలు అందిస్తున్నాయి.

ఢిల్లీ మెట్రో రైలు రూపకర్త శ్రీధరన్.

ఢిల్లీ మెట్రో రైలు, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించాయి.

మెట్రోకి సంబంధించిన అప్పటి క్లిప్పింగులు, ఫొటోలు, వార్తా పత్రికలను ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉంచారు.

మెట్రో రెండు దశాబ్దాల ప్రయాణం గుర్తుగా ట్రేసింగ్ ఢిల్లీ మెట్రో జర్నీ పేరిట శాశ్వత ఎగ్జిబిషన్‌గా దీనిని మార్చారు.

తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్:

డీజీపీగా మహేందర్‌రెడ్డి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో అంజనీకుమార్‌ను డీజీపీగా ప్రభుత్వం నియమించింది.

ప్రస్తుతం ఆయన అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్నారు. ఏడేళ్లుగా రాచకొండ కమిషనర్‌గా ఉన్న మహేశ్ భగవత్‌ను సీఐడీ చీఫ్ (అదనపు డీజీ)గా నియమించింది.

దాతల జాబితాలో అగ్రస్థానంలో బిల్‌గేట్స్‌ :

సేవా కార్యక్రమాలకు 2022 లో అత్యధిక మొత్తంలో విరాళాలు అందించిన మొదటి 10 మంది వ్యక్తులు లేదా సంస్థల జాబితాలో బిల్‌గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. ద క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రఫీ విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ పది మంది ఇచ్చిన విరాళాల మొత్తం 9.3 బిలియన్ డాలర్లు.

ఇందులో బిల్‌గేట్స్ ఒక్కరే 5 బిలియన్ డాలర్లను బిల్ అండ్ మిలిందా గేట్స్ కు విరాళమిచ్చారు.

అమెజాన్ వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్ తల్లి, అతని సవతి తండ్రి అయిన జాకీ బెజోస్, మైక్ బెజోస్ లు 710.5 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు.

474.3 మిలియన్ డాలర్లు దానం చేసి వారన్ బఫెట్ తర్వాతి స్థానంలో ఉన్నారు.

బిఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ భాటియా అరుదైన రికార్డు:

ఢిల్లీలోని గోలాధర్ మైదానంలో బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ అద్వితీయ రికార్డు సృష్టించారు.

సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఇన్‌స్పెక్టర్ విశ్వజీత్ భాటియా, రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ మోటార్ సైకిల్‌ను పుట్‌రెస్ట్‌పై నిలబడి నడిపారు.

ఏకంగా 100 కి.మీ పాటు బైక్‌ను నడిపి రికార్డు నెలకొల్పాడు.

మొత్తం 2 గంటల 38 నిమిషాల 23 సెకన్ల పాటు నడిపి అరుదైన రికార్డు సృష్టించాడు.

రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణకు మూడో స్థానం:

తెలంగాణ రాష్ట్రంలో మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, తద్వారా మరణాలు పెరుగుతూనే ఉన్నాయి.

తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో దేశంలో తెలంగాణ 3వ స్థానంలో, మరణాల్లో రెండో స్థానంలో ఉంది.

బ్లాక్‌స్పాట్లలో 4వ స్థానం:

అత్యధికంగా రొడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల (బ్లాక్ స్పాట్ల) విషయంలో దేశంలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది.

తమిళనాడులో అత్యధికంగా 748 బ్లాక్ స్పాట్లు ఉండగా తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ (701), కర్ణాటక (551), తెలంగాణ (485), ఆంధ్రప్రదేశ్ (466) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అసాధారణ స్థాయిలో పెరుగుతున్న సముద్ర మట్టాలు:

ఇటీవల దశాబ్దాలలో సముద్ర మట్టాలు అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయని కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

1901 -71 మధ్య కాలంలో సముద్ర మట్టం ఏటా సగటున 1.3 మిల్లీమీటర్ల చొప్పున పెరగ్గా 2006 -18 మధ్య 3.7 మి.మీ చొప్పున పెరిగినట్లు వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ బృందం తాజా నివేదిక తెలిపింది.

సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీర ప్రాంతం కోతకు గురవుతోంది. పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, డామ్‌న్ దీవులలో సముద్రతీరం అత్యధికంగా కోతకు గురైందని మంత్రి వివరించారు.

సముద్ర మట్టాలపై పరిశోధనకు విశాఖపట్నం, తిరువునంతపురం, భువనేశ్వర్, అహ్మదాబాద్‌లలో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

భారత్ లో పెరిగిన బాల్య వివాహాలు:

దేశంలో బాల్య వివాహాలు పెరిగాయని.. జాతీయ నేర గణాంకాల బ్యూరో వెల్లడించినట్లు స్మృతి ఇరానీ చెప్పారు.

2019లో 523 బాల్య వివాహాలు నమోదు కాగా 2021లో అవి 1050 కి పెరిగాయన్నారు.

దీనికి కారణం ఎక్కువ బాల్య వివాహాలు జరగడం కాదని.. ఈ సారి పౌరులు ఎక్కువగా అలాంటి వివాహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.

సామాజిక పురోగతిలో తెలంగాణకు 26, ఏపీకి 23వ స్థానం:

ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన సామాజిక పురోగతి సూచికల్లో తెలుగు రాష్ట్రాలు దిగువ మధ్య స్థాయిలో నిలిచాయి.

పుదుచ్చేరి, లక్షద్వీప్, గోవా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

ఏపీ 23, తెలంగాణ 26వ స్థానాలకు పరిమితమయ్యాయి.

అస్సాం, బీహార్, జార్ఖండ్ చివరి స్థానాల్లో నిలిచాయి.

సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా పేరుతో అన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్ నెస్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ ఇంపరేటివ్ రూపొందించిన నివేదికను ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ బిబేక్ డెబ్రాయ్ విడుదల చేశారు.

మహిళలపై నేరాల్లో నాలుగో స్థానంలో తెలంగాణ:

మహిళలపై అత్యధిక నేరాలు జరిగే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది.

విద్యార్థుల ప్రాథమిక జ్ఞానానికి సంబంధించి ఎన్ఏఎస్ సర్వేలో తెలంగాణ చివరి స్థానంలో ఉంది.

వివిధ నివేధికల్లో తెలంగాణ స్థానం:

భూగర్భ జలాలు ఎక్కువగా వాడిన జిల్లాలు - హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల

వ్యక్తిగత భద్రత విషయంలో తెలంగాణ జాతీయ సగటు స్కోరు 61.89 కంటే 20 పాయింట్లు దిగువన ఉంది.

మానవ అక్రమ రవాణాలో తెలంగాణలోని మేడ్చల్ జిల్లా 52 మార్కులతో దేశంలో రెండో స్థానంలో ఉంది.

తెలంగాణలో బాలకార్మికులు అత్యధికంగా ఉన్నట్లు పేర్కొంది.

Advertisement

Next Story