- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాపులర్ ఫ్లవర్స్.. మస్త్ ప్రాఫిట్స్..
దిశ, కుత్బుల్లాపూర్ : జెర్బరా పూలంటే మనందరికి సరిగ్గా తెలియకపోవచ్చు. కానీ చూస్తే మాత్రం గుర్తు పడతాం. వీటిని వివాహాలు, పుట్టిన రోజులు, తదితర శుభాకార్యాల్లో స్టేజీలు, ఇతరాత్ర అలంకరణకు ఉపయోగిస్తారు. దశాబ్ధాల కిందట మహారాష్ట్ర, కర్ణాటక, పూణే, ముంబై ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగించేవారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్లలో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ)లో ఈ పూలను సాగు చేస్తూ ఆసక్తి ఉన్న రైతులకు శిక్షణనిస్తుంది. అధికారుల శిక్షణ తీసుకుని ప్రస్తుతం మన రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోనూ సాగు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ పంటల సాగుకు అవసరైన సమయంలో సబ్సిడీ సైతం కల్పిస్తుండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు.
జీడిమెట్లలో…
జీడిమెట్ల పైప్‌లైన్ రోడ్డులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అధికారులు 500 స్క్వేర్ మీటర్ల వెడల్పులో పూలను సాగుచేస్తున్నారు.మీటర్‌కు 6 మొక్కల చొప్పున 2400మొక్కలను పెంచగా విరివిగా పూయడం ప్రారంభమైంది. ఇక్కడ పండించిన పూలను ఒక్కొక్కటి రూ.3ల చొప్పున విక్రయిస్తున్నారు.
సాగు ఇలా..
జెర్బరా పూల సాగు సులభతరంగా ఉంటుంది. ఈ పూల మొక్కలకు విత్తనాలుండవు. మహారాష్ట్ర, బెంగళూరు ప్రాంతంలో ఈ మొక్కలనుటిష్యుకల్చర్(టెస్ట్ ట్యూబ్) విధానంతో ప్రవర్థనం చేస్తారు. అక్కడి నుంచి మొక్కలను కొనుగోలు చేసి తీసుకొస్తారు. ఈ మొక్కలనుపాలీ హౌజ్‌లలో మాత్రమే సాగు చేయాలి. ఒక్కో మొక్కకు రూ.25నుంచి రూ.35 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఎకరం విస్తీర్ణంలో 24వేల మొక్కలను సాగు చేయవచ్చు. మూడు నెలలకు పంట వస్తుంది. ఎకరంలో వేసిన మొక్కలు రోజుకు 3వేల పూలను అందిస్తాయి.ఈ పూలు ప్రస్తుతం రూ.3 విక్రయిస్తుండగా వివాహాలు, శుభాకార్యాలు జరిగే కాలంలో అయితే రూ.5 నుంచి రూ.8 వరకు విక్రయించొచ్చు. నాటిన మొక్క మూడు సంవత్సరాల వరకు పంటనిస్తుంది.
రైతులకు లాభాల సాగు..
జెర్బరా పూల సాగుతో రైతులకు ఎంతో ప్రయోజనం. ఈ పంటను వేసిన అనంతరం గులాబీ, కార్నివాల్ పంటలు సైతం అదే పాలీ హౌజ్‌లో వేసుకోవచ్చు. ఈ పంట సాగుపై సీఓఈలో ప్రత్యేక శిక్షణను ఇప్పటికే ఇచ్చాం. ప్రభుత్వ ఆదేశానుసారం అవసరమైన సమయంలో శిక్షణను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.
– రాజ్‌కుమార్, సీఓఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్