- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరణించిన తర్వాత మరడోనాపై అత్యాచార ఆరోపణలు
దిశ, స్పోర్ట్స్: దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డిగో మరడోనాపై అతడు మరణించిన తర్వాత క్యూబాకు చెందిన మహిళ సంచలన ఆరోపణలు చేసింది. మరడోనా అనుచరులు మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల అమ్మకం, భౌతిక దాడుల వంటి నేరాలకు పాల్పడ్డారని మావిస్ అల్వరేజ్ మీడియాకు తెలిపారు. అర్జెంటీనాకు చెందిన డిగో మరడోనా తనపై అత్యాచారం కూడా చేశాడని సదరు మహిళ ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై బాధిత మహిళ ఫిర్యాదు చేయకపోవడంతో అర్జెంటీనాకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆ మహిళ తనకు జరిగిన అన్యాయం గురించి మీడియాకు వెల్లడించింది.
‘నేను టీనేజీలో ఉండగా 2001లో మరడోనాను కలిశాను. అప్పటికే డ్రగ్స్‌కు బానిసైన మరడోనాకు రీహాబిలిటేషన్ చికిత్స అందిస్తున్నారు. అందుకోసం అతడు క్యూబా వచ్చాడు. అప్పుడు మరడోనాతో నాకు పరిచయం ఏర్పడింది. అతడితో నాలుగైదేళ్లు సన్నిహితంగా ఉన్నాను. అయితే మరడోనా తనపై దాడికి పాల్పడమే కాకుండా డ్రగ్స్ తీసుకోవాలని బలవంతం చేశాడు. పలుమార్లు భౌతిక దాడులు చేయడమే కాకుండా అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు’ అని ఆమె మీడియా ఎదుట తన బాధను వెల్లడించింది. కాగా, మరడోనా గత ఏడాది నవంబర్ 25న మరణించాడు. తనకు అన్యాయం జరిగిన చాలా ఏళ్ల తర్వాత.. అది కూడా మరడోనా మరణించిన తర్వాత ఆరోపణలు చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే తాను ఇన్నాళ్ల తర్వాత అయినా నోరు విప్పడం సంతోషంగా ఉన్నదని ఆమె అన్నారు. తనలాగ బాధపడిన యువతులు ఇప్పటికైనా బయటకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.