కరోనాపై సీఆర్పీఎఫ్ బలగాల అవగాహన

by Sridhar Babu |   ( Updated:2020-04-13 07:30:51.0  )
కరోనాపై సీఆర్పీఎఫ్ బలగాల అవగాహన
X

దిశ, కరీంనగర్: నక్సల్స్ ఏరివేతలో నిరంతరం తలమునకలై ఉండే పారా మిలటరీ ఫోర్స్ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నడుం బిగించింది. దట్టమైన అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ చేయాల్సిన సీఆర్పీఎఫ్ బలగాలు మొదటి సారిగా గ్రామాల బాట పట్టాయి.కరోనా నేపథ్యంలో ఎవరూ ఆ మహమ్మారికి బలవ్వకుండా ఉండేందుకు ఆరోగ్య రక్షణపై పల్లె వాసులకు అవగాహన కల్పిస్తున్నాయి. సోమవారం భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మద్దులపల్లి గ్రామాంలో సీఆర్పీఎఫ్ 58వ బెటాలియన్ బలగాలు కరోనా నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై వివరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ మంజుల అన్నారు. సామాజిక దూరం పాటించడం, గ్రామంలోకి కొత్తగా వచ్చిన వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం మద్దులపల్లి గ్రామస్తులకు భోజనం ఏర్పాటు చేయడంతోపాటు మాస్కులు పంపిణీ చేశారు.
tags ;corona,lockdown, crpf police, explain how corona is danger, to people

Advertisement

Next Story