దారుణం.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను కడతేర్చిన భార్య

by Rajesh |
దారుణం.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను కడతేర్చిన భార్య
X

దిశ, నాగర్ కర్నూల్ : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య కడతేర్చడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సీఐ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని 15వ వార్డుకు చెందిన శివ శంకర్, శివలీల భార్యాభర్తలు. శివ శంకర్ హమాలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుండడంతో భార్యాభర్తలు ఇద్దరూ తరచూ గొడవ పడుతూ ఉండేవారు. గురువారం రాత్రి ఇద్దరు తాగి మళ్లీ గొడవ పెట్టుకున్నారు. దీంతో భర్తను పక్కనే ఉన్న రాళ్లు, కర్రలతో కొట్టి భార్య హతమార్చింది. తెల్లవారుజామున ఇంటి పక్కన వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ కనకయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శివలీలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

Next Story

Most Viewed